ది గర్ల్ ఫ్రెండ్... అత్యధిక రేటుతో రికార్డ్
ఆకట్టుకునే అందం తో పాటు తన నటనతో సినిమాల స్థాయిని పెంచుతూ ఉన్న రష్మిక మందన్న తన మోస్ట్ అవైటెడ్ లేడీ ఓరియంటెడ్ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయింది.
By: Ramesh Palla | 25 Oct 2025 4:20 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ ఏడాది ఇప్పటి వరకు ఛావా, సికిందర్, కుబేరా, థామా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సల్మాన్ ఖాన్‌తో నటించిన సికిందర్ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ధనుష్ తో కలిసి నటించిన కుబేరా సినిమా మాత్రం వంద కోట్లకు మించి వసూళ్లు రాబట్టి హిట్ చిత్రాల జాబితాలో నిలిచింది. థామా సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే ప్రతి సినిమా కూడా రష్మిక మందన్న స్థాయిని పెంచుతూనే వచ్చింది. ఆకట్టుకునే అందం తో పాటు తన నటనతో సినిమాల స్థాయిని పెంచుతూ ఉన్న రష్మిక మందన్న తన మోస్ట్ అవైటెడ్ లేడీ ఓరియంటెడ్ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయింది.
రష్మిక మందన్న హీరోయిన్‌గా ది గర్ల్ ఫ్రెండ్
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. టీజర్ విడుదల సమయంలోనే మ్యాటర్ ఉన్న సినిమా అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ సినిమా విడుదల తేదీ ఎప్పుడు అని చెక్ చేస్తున్నారు. రష్మిక మందన్న తన నటన విశ్వరూపం చూపించినట్లుగా నటించిందని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ట్రైలర్ కట్ తో సినిమాపై అంచనాలు, ఆసక్తి పెంచారు. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రేక్షకులు సినిమా కోసం ఎదురు చూడటం, థియేట్రికల్ రిలీజ్ కి ఉన్న బజ్ నేపథ్యంలో ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. పలు ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చినప్పటికీ నెట్‌ఫ్లిక్స్ వారు ఈ సినిమాను భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను నెట్‌ఫ్లిక్స్ ఇండియా వారు దాదాపుగా రూ.14 కోట్ల పెట్టినట్లు తెలుస్తోంది. ఒక లేడీ ఓరియంటెడ్ మూవీకి ఈ మొత్తం ఖచ్చితంగా ఎక్కువగా చెబుతున్నారు. మీడియం రేంజ్ బడ్జెట్ మూవీకి ఈ స్థాయి బిజినెస్ జరగడం రికార్డ్ అంటున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసం ను వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ఈ సినిమా థియేట్రికల్ రన్ విషయంలో దెబ్బ తీసినా కచ్చితంగా ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచే కంటెంట్ అంటున్నారు. రష్మిక మందన్న కోసం అయినా సినిమాను ఓటీటీ లో చూసేందుకు ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్ లో లాగిన్ అవుతారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే ముందు చూపుతో నెట్‌ఫ్లిక్స్ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
దీక్షిత్ శెట్టి హీరోగా రావు రమేష్ ముఖ్య పాత్రలో...
రష్మిక మందన్న పుష్ప 2, యానిమల్, ఛావా సినిమాలతో బాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంది. కనుక ది గర్ల్ ఫ్రెండ్ హిందీలోనూ కచ్చితంగా డీసెంట్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగుతో పాటు సౌత్ లో అన్ని భాషల్లోనూ సినిమా విడుదల కాబోతుంది. ఈ పాన్ ఇండియా లేడీ ఓరియంటెడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లు నమోదు చేస్తుందో చూడాలి. పుష్ప 2 సినిమా విడుదల సమయంలోనే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ఏడాదిలో అయినా ఉంటుందా లేదా అనుకుంటున్న సమయంలో ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాలో హీరోగా దీక్షిత్ శెట్టి నటించాడు. అను ఎమాన్యూల్ సైతం ఈ సినిమాలో కనిపించబోతుంది. రావు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు.
