'ది గర్ల్ ఫ్రెండ్'.. స్లో స్టార్ట్, సాలిడ్ పికప్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న 'ది గర్ల్ ఫ్రెండ్'గా ఈరోజు (నవంబర్ 7) థియేటర్లలోకి వచ్చేసింది.
By: M Prashanth | 7 Nov 2025 9:30 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న 'ది గర్ల్ ఫ్రెండ్'గా ఈరోజు (నవంబర్ 7) థియేటర్లలోకి వచ్చేసింది. 'పుష్ప', 'యానిమల్' లాంటి ఫుల్ యాక్షన్ మోడ్ నుంచి, రష్మిక ఈసారి కంప్లీట్ రొమాంటిక్ డ్రామాతో రావడంతో.. సినిమాపై యూత్‌లో మంచి బజ్ ఉంది. అయితే, మార్నింగ్ షోలకు రెస్పాన్స్ కొంచెం మిక్స్‌డ్‌గా, స్లోగా స్టార్ట్ అయింది.
కానీ, అసలు మ్యాటర్ ఈవినింగ్ షోల నుంచి మొదలైంది. ముఖ్యంగా సిటీల్లో, మల్టీప్లెక్స్‌లలో ఆడియన్స్ రెస్పాన్స్ మారిపోయింది. సినిమా చూసిన వాళ్ల నుంచి 'వైబ్ బాగుంది', 'ఎమోషన్స్ కనెక్ట్ అవుతున్నాయి' అనే పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. దీంతో ఈవినింగ్, నైట్ షోలకు బుకింగ్స్ పుంజుకున్నాయి. ఫ్రైడే ఈవినింగ్ నుంచి వీకెండ్‌కు ఇది కీలకంగా మారనుంది.
ఈ ఛేంజ్ ఆన్‌లైన్ బుకింగ్స్‌లో క్లియర్‌గా కనిపిస్తోంది. 'బుక్ మై షో' ఓపెన్ చేస్తే, 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. జస్ట్ లాస్ట్ గంటలోనే 2000కు పైగా టికెట్లు బుక్ అయ్యాయంటే.. పికప్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది సాలిడ్ ఇండికేషన్.
కేవలం బుకింగ్స్ మాత్రమే కాదు, యూజర్ రేటింగ్స్ కూడా దుమ్ములేపుతున్నాయి. 'బుక్ మై షో'లో ఇప్పటికే 820 మందికి పైగా ఓటేస్తే, రేటింగ్ ఏకంగా 9.4/10గా నమోదైంది. రిలీజ్ రోజు ఇంత స్ట్రాంగ్ రేటింగ్ దక్కడం మామూలు విషయం కాదు. అంటే, సినిమా చూసిన వాళ్లకు గట్టిగానే కనెక్ట్ అయిందన్నమాట.
సినిమా రెగ్యులర్ రొమాంటిక్ కామెడీ కాదని, మంచి ఫీల్ ఉన్న ఎమోషనల్ డ్రామా అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా, రష్మిక పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. రాహుల్ రవీంద్రన్ టేకింగ్, డైలాగ్స్ కూడా ఈ పాజిటివ్ టాక్‌కు హెల్ప్ అవుతున్నాయి.
ఓవరాల్‌గా, మార్నింగ్ షోలు కాస్త డల్‌గా ఉన్నా, ఈవినింగ్ నుంచి 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రాక్‌లోకి వచ్చేసింది. ఈ పాజిటివ్ బుకింగ్స్, స్ట్రాంగ్ యూజర్ రేటింగ్స్.. వీకెండ్ మొత్తానికి సినిమాకు పెద్ద ప్లస్ కాబోతున్నాయి. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ రొమాంటిక్ డ్రామాకు మంచి వీకెండ్ గ్యారెంటీ.
