ది గర్ల్ ఫ్రెండ్.. అనదర్ లవబుల్ సాంగ్..!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో వస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. దీక్షిత్ శెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.
By: M Prashanth | 26 Aug 2025 1:10 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో వస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. దీక్షిత్ శెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. చిలసౌ ఫేం రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినేని ఈ సినిమా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ ఫాం లో ఉన్న రష్మిక నుంచి వస్తున్న ఈ సినిమాపై కూడా బజ్ బాగుంది.
హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్..
ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఆడియన్స్ కి ఎంగేజ్ అవగా రీసెంట్ గా వచ్చిన నదివే సాంగ్ కూడా ఇంప్రెస్ చేసింది. ఇక లెటెస్ట్ గా సినిమా నుంచి ఏం జరుగుతుంది సాంగ్ రిలీజైంది. ఈ సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాను మ్యూజిక్ అందిస్తున్న ప్రతి సినిమాతో మ్యూజిక్ తో ఇంప్రెస్ చేస్తున్నాడు హేషం. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కూడా బెస్ట్ మ్యూజిక్ ఇస్తున్నాడు హేషం.
ఇక ఏం జరుగుతుంది సాంగ్ విషయానికి వస్తే.. ఈ సాంగ్ లో దీక్షిత్, రష్మిక బాండింగ్ ని చూపిస్తూ వచ్చింది. ఏం జరుగుతుంది సాంగ్ ని రాకెందు మౌళి రాయగా హేషం అబ్దుల్ వాహబ్ ఇంకా చిన్మయి ఆలపించారు. చిన్మయి పాడే తెలుగు పాటలకు సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆఫ్టర్ గ్యాప్ చిన్మయి పాడిన ఈ సాంగ్ సంథింగ్ స్పెషల్ గా ఉందని చెప్పొచ్చు.
రష్మిక, దీక్షిత్ శెట్టి ది గర్ల్ ఫ్రెండ్..
రష్మిక, దీక్షిత్ శెట్టి నటించిన ది గర్ల్ ఫ్రెండ్ నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తెలుగుతో పాటు హిందీలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమాతో రష్మిక తన సత్తా చాటుతుందా లేదా అన్నది చూడాలి.
ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే రష్మిక ఇలా కంటెంట్ ఉన్న సినిమాలతో కూడా తన సత్తా చాటుతుంది. రష్మిక దీక్షిత్ శెట్టి ఈ ఇద్దరి లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. రష్మిక ఫ్యాన్స్ కి మాత్రం ది గర్ల్ ఫ్రెండ్ సూపర్ ట్రీట్ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ సక్సెస్ ఫాం లో ఉంది కాబట్టి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు మంచి బజ్ వచ్చింది.
