Begin typing your search above and press return to search.

రష్మిక గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ? ఏం జరుగుతోంది?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ? అదేనండీ గర్ల్ ఫ్రెండ్ మూవీ.. ఆమె లైనప్ లో సినిమానే అది. లేడీ ఓరియెంటెడ్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాలో రష్మిక గర్ల్ ఫ్రెండ్ గా కనిపించనున్నారు.

By:  M Prashanth   |   5 Sept 2025 10:12 PM IST
రష్మిక గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ? ఏం జరుగుతోంది?
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ? అదేనండీ గర్ల్ ఫ్రెండ్ మూవీ.. ఆమె లైనప్ లో సినిమానే అది. లేడీ ఓరియెంటెడ్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాలో రష్మిక గర్ల్ ఫ్రెండ్ గా కనిపించనున్నారు. ఆమె బాయ్ ఫ్రెండ్ గా కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. అందమైన ప్రేమకథగా నటుడు రాహుల్‌‌‌‌ రవీంద్రన్‌‌‌‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రొడ్యూసర్లు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తుండగా.. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న గర్ల్ ఫ్రెండ్ మూవీ చిత్రీకరణ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. కానీ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు.

సెప్టెంబర్ 5వ తేదీన గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అవుతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ నేడు రిలీజ్ కాలేదు. ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పటికే మూవీ చాలా ఆలస్యం అవుతోంది. ఇంకా ఆలస్యమైతే ఇబ్బందే. ముఖ్యంగా అసలు ఏం జరుగుతుందో కూడా క్లారిటీ లేదు. రెండు సింగిల్స్ ను మేకర్స్ రిలీజ్ చేసినా రిలీజ్ పై ప్రకటన లేదు.

అదే సమయంలో రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం నటుడిగా లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా బిజీగా లేరు. కాబట్టి గర్ల్ ఫ్రెండ్ మూవీపై స్పెషల్ ఫోకస్ పెట్టే సమయం ఆయనకు ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యే దశకు చేరుకుందని తెలుస్తోంది. కాబట్టి శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరపవచ్చు. మరోవైపు రష్మిక పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

హిందీలో థామా, తెలుగులో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తోంది. ఇప్పటికే గర్ల్ ఫ్రెండ్ మూవీలో తన పార్ట్ ను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు మేకర్స్ ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారో వారికే తెలియాలి. అయితే ఇంకాస్త షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. దానిపై ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేశారని వినికిడి.

ఏదేమైనా మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో బజ్ క్రియేట్ అయ్యి ఉందనే చెప్పాలి. కానీ దాన్ని పట్టించుకోకుండా రిలీజ్ లేట్ చేస్తే మాత్రం అంత మంచిది కాదు. సినిమా బాక్సాఫీస్ రన్‌ ను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో 2025లో వివిధ సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్స్ ను లాక్ చేసుకున్నాయి. మరి గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో.. ఎంతలా మెప్పిస్తుందో వేచి చూడాలి.