Begin typing your search above and press return to search.

'ది గర్ల్‌ఫ్రెండ్‌' సెన్సార్‌ రిపోర్ట్‌

రష్మిక నుంచి ఈ ఏడాది చివర్లో రాబోతున్న మరో సినిమా 'ది గర్ల్‌ ఫ్రెండ్‌'. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

By:  Ramesh Palla   |   6 Nov 2025 11:35 AM IST
ది గర్ల్‌ఫ్రెండ్‌ సెన్సార్‌ రిపోర్ట్‌
X

ఈ ఏడాది నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి అంతా బాగా జరుగుతోంది. బాలీవుడ్‌ మూవీ ఛావాతో ఈ ఏడాదిని ఆరంభించి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రష్మిక మందన్న ఈ ఏడాదిలో చేసిన అన్ని సినిమాలు కమర్షియల్‌గా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా వసూళ్లు సాధించాయి. సల్మాన్‌ ఖాన్‌తో నటించిన సికిందర్‌ సినిమా డిజాస్టర్‌ టాక్‌ దక్కించుకున్నప్పటికీ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ద్వారా కమర్షియల్‌గా పర్వాలేదు అనిపించుకుంది. కుబేరా సినిమాతోనూ వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు సాధించిన రష్మిక మందన్న ఇటీవల బాలీవుడ్‌ మూవీ థామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ ప్రేక్షకులను థామా సినిమా ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది అంటూ విమర్శలు వచ్చాయి. కానీ సినిమా వసూళ్ల పరంగా మాత్రం డీసెంట్‌గానే నిలిచింది. థామా సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్‌ ఓపెనింగ్స్ రాబట్టడంలో రష్మిక కీలక పాత్ర పోషించింది.




ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా సెన్సార్‌ కంప్లీట్‌

రష్మిక నుంచి ఈ ఏడాది చివర్లో రాబోతున్న మరో సినిమా 'ది గర్ల్‌ ఫ్రెండ్‌'. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ట్రైలర్‌ ఆకట్టుకుంది. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో రష్మిక సందడి చేసింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమా ఒక మంచి ఫీల్‌ గుడ్‌ మూవీ అని, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ అల్లు అరవింద్‌ ఇటీవల ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న సమయంలో చెప్పిన విషయం తెల్సిందే. దాంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు తాజాగా పూర్తి అయ్యాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా సినిమా సెన్సార్‌ కంప్లీట్‌ పోస్టర్‌ ను షేర్‌ చేయడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది.

రష్మిక మందన్న హీరోయిన్‌గా...

లేడీ ఓరియంటెడ్‌ మూవీ అంటూనే ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ నుంచి యూ/ఎ సర్టిఫికెట్‌ను తీసుకోవడంతో ఇందులో ఉన్న ఆ ఎ కంటెంట్‌ ఏమై ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు ఈ సినిమాకి చిన్న చిన్న కట్స్ చెప్పి, కొన్ని డైలాగ్స్‌ను మ్యూట్‌ చేసి యూ/ఎ సర్టిఫికెట్‌ జారీ చేయడం జరిగిందని చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. సినిమా విషయంలో సెన్సార్‌ బోర్డ్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తోంది. సెన్సార్‌ కాపీ చూసిన సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు, ముఖ్యంగా ప్రొడక్షన్ టీం వారు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు సైతం భావోద్వేగానికి గురి అయ్యే విధంగా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఉన్నాయని, దాంతో సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసం యూనిట్‌ సభ్యుల్లో మరింతగా పెరిగింది.

అల్లు అరవింద్‌ సమర్పణలో...

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించినట్లుగా అనిపిస్తోంది. ఒక సింపుల్‌ గర్ల్‌ గా రష్మిక కనిపించింది, ఆ తర్వాత పరిణామాల కారణంగా ఆ సింపుల్‌ గర్ల్‌ పూర్తిగా మారుతుంది. ఆ క్రమంలో చాలా భావోద్వేగాలు ఉంటాయట. వాటన్నింటిని రష్మిక చక్కగా ప్రదర్శించింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు దక్కని ఆధరణ కచ్చితంగా ఈ సినిమాకు దక్కుతుంది అనే విశ్వాసంను అంతా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ ప్రమోషన్‌ జరుగుతోంది. మరికొన్ని గంటల్లో రాబోతున్న ఈ ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా ఎలా ఉంటుందో తెలిసి పోతుంది. రష్మిక మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా లేదా అనేది తెలియాలంటే ఈ కొన్ని గంటలు వెయిట్‌ చేయాల్సిందే. ప్రమోషన్‌ సమయంలో అల్లు అరవింద్‌ చేసిన కామెంట్స్ ఎంత వరకు నిజం అనేది కూడా మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.