అర్జున్ రెడ్డి - ది గర్ల్ ఫ్రెండ్.. చూడ్డానికి ఒకటే.. కానీ పూర్తిగా భిన్నం!
కానీ అలాంటి సమయంలోనే హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో పోలుస్తూ చాలామంది పోస్టులు పెట్టడంతో తాజాగా ఈ విషయం పైన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించారు.
By: Madhu Reddy | 5 Nov 2025 1:41 PM ISTటాలీవుడ్ లో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించిన రష్మిక.. నటుడు డైరెక్టర్ గా పేరు సంపాదించిన రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మొన్నా మధ్య ట్రైలర్ విడుదల అవ్వగా.. అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. కానీ అలాంటి సమయంలోనే హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో పోలుస్తూ చాలామంది పోస్టులు పెట్టడంతో తాజాగా ఈ విషయం పైన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ స్పందించారు.
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. అసలు అర్జున్ రెడ్డి, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలకు మధ్య ఎలాంటి పోలిక లేదు. వాస్తవంగా చెప్పాలి అంటే అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కి ముందే తాను గర్ల్ ఫ్రెండ్ సినిమా స్టోరీని రాసుకున్నానంటూ తెలియజేశారు. అర్జున్ రెడ్డి సినిమా ఒక కల్ట్ మూవీ , ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక గేమ్ ఛేంజర్ గా మారిపోయింది. అలాంటి గొప్ప ఆదరణ సొంతం చేసుకొని ఎన్నో రికార్డులను సైతం సృష్టించింది" అంటూ తెలియజేశారు రాహుల్ రవీంద్రన్. అయితే తాము తెరకెక్కించిన గర్ల్ ఫ్రెండ్ సినిమా మాత్రం చాలా చిన్నది, అర్జున్ రెడ్డి వంటి సినిమాకి దగ్గరలో కూడా ఉండదు. ట్రైలర్ విడుదలైన తర్వాతే చాలామంది ఈ రెండు చిత్రాలకు మధ్య పోలికలను చూపిస్తూ పోస్టులు పెట్టేవరకు తనకు ఈ విషయం తెలియదని వెల్లడించారు.
ఒకవేళ చూడడానికి ఈ రెండు చిత్రాలు ఒకేలా కనిపించవచ్చు కానీ రెండు పూర్తి భిన్నమైనవి అంటూ వెల్లడించారు. అలాగే రష్మిక విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ వ్యవహారంపై కూడా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. ఆ రూమర్స్ గురించి తనకైతే తెలియదని, వారిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమే అని తనకు తెలుసు అని వెల్లడించారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ కోసం విజయ్ దేవరకొండ తన వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల గురించి తాను ఎప్పుడు కూడా ఎలాంటి విషయాలను మాట్లాడను అంటూ తెలియజేశారు రాహుల్ రవీంద్రన్ .
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కేవలం రష్మిక మీదే నడిచేలా కనిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా మరిన్ని నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా రష్మిక ఎన్నో విషయాలను తెలియజేసింది. రష్మిక సినిమా విషయాలకు వస్తే.. మైసా, రెయిన్బో వంటి చిత్రాలలో నటిస్తోంది. అలాగే ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఈమె హీరోయిన్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే వరుస చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ అందుకున్న రష్మిక ఈ చిత్రాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
