రష్మిక థామా ట్రైలర్ వచ్చేసింది!
ఆయుష్మాన్ ఖురానా హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పవచ్చు.
By: Madhu Reddy | 27 Sept 2025 11:45 AM ISTరష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఒకవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్.. మరొకవైపు మాస్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.. అలాంటి ఈమె తాజాగా హారర్ జానర్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే బాలీవుడ్ లో ఆమె నటిస్తున్న హారర్ చిత్రం థామా.. ఆయుష్మాన్ ఖురానా హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పవచ్చు.
నిజానికి ఈ బ్యానర్ పై అభిమానులలో ఎప్పటికీ కూడా క్యూరియాసిటీ ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఈ బ్యానర్ పై ఇప్పటివరకు భేదియా, మూంజ్యా, స్త్రీ వంటి సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అదే కోవాలో రాబోతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21న దీపావళి సందర్భంగా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం.. అందులో భాగంగానే హిందీలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
భేదియా , మూంజ్యా సినిమాలను కలుపుతూ థామా సినిమాను తెరకెక్కించినట్లు అనిపిస్తోంది. వందల ఏళ్ళ క్రితం యక్షసన్ అనే ఒక వాంపైర్ ఉంటారు. అతను ఒకరి దగ్గర బందీలై ఉంటారు. అతడిని హీరో కలవడంతో హీరోకి కూడా ఆ వాంపైర్ లక్షణాలు వస్తాయి. దాంతో తెలియకుండానే కొన్ని దుష్టశక్తులతో పోరాటం చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి ఎలిమెంట్స్ తోనే ట్రైలర్ ను కట్ చేయడం జరిగింది. ఇందులో ఆయుష్మాన్ , నవాజుద్దీన్ సిద్ధికి, రష్మిక కనిపించారు. అలాగే హీరో తండ్రిగా పరీష్ రావల్ కామెడీ పాత్ర పోషించినట్లు చూపించారు. అన్ని రకాల ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అసలే బాలీవుడ్లో ఛావా తర్వాత సికందర్ మూవీ చేసి డిజాస్టర్ ను మూటగట్టుకున్న రష్మిక ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రష్మిక తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. అటు తమిళ్లో కాంచన ఫ్రాంచైజీ లో భాగంగా వస్తున్న కాంచన 4 లో కూడా భాగమయ్యింది. అలాగే అట్లీ , అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న AA22xA6 సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది. అలాగే రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలలో కూడా నటిస్తున్న ఈమె మరొకవైపు విజయ్ దేవరకొండ తో కలిసి మూడో సినిమాలో కూడా నటిస్తోంది. దీనికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇలా తెలుగు, తమిళ్ , హిందీ అంటూ వరుస పెట్టి చిత్రాలు చేస్తూ మరింత బిజీగా మారిపోయింది రష్మిక. రెండు మూడేళ్లుగా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న ఈమె.. వచ్చే ఏడాది ఆఖరి వరకు బిజీ షెడ్యూల్స్ తో దూసుకుపోతోంది.
