ఆ ఒక్క సీన్ కోసం రూ.20 కోట్లు... ఫలితం ఏంటి?
ఆయుష్మాన్ ఖురానా హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా రూపొందిన బాలీవుడ్ మూవీ 'థామా' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Ramesh Palla | 27 Oct 2025 11:08 AM ISTఆయుష్మాన్ ఖురానా హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా రూపొందిన బాలీవుడ్ మూవీ 'థామా' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్‌లో రష్మిక మందన్నకి ఉన్న క్రేజ్ తో థామా సినిమా మొదటి వారం రోజులు మంచి వసూళ్లు నమోదు చేసింది. హిందీ ప్రేక్షకులకు ఉన్న థ్రిల్లర్ సినిమాల ఇష్టం కారణంగా మిశ్రమ స్పందన వచ్చినా కూడా వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. థామా సినిమా కోసం దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్ భారీగా ఖర్చు చేసినట్లు వెండి తెరపై చూస్తుంటే అర్ధం అవుతుంది. రష్మిక మందన్న నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. సినిమాలోని కొన్ని సీన్స్ హాలీవుడ్ హర్రర్ సినిమాల్లోని సీన్స్ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాయి అంటూ స్వయంగా ప్రేక్షకులు కొందరు సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకుంటున్నారు.
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా థామా..
ఇక ఈ సినిమాలోని అత్యంత కీలకమైన భేడియా సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా కథనాల అనుసారం ఆ ఒక్క సీక్వెన్స్ కోసం నిర్మాతలతో దర్శకుడు ఆదిత్య ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేయించాడట. ఆ విజువల్స్ చిత్రీకరించేందుకు భారీగా ఖర్చు అయింది, అంతే కాకుండా వాటి కోసం అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ కంపెనీతో వీఎఫ్‌ఎక్స్ చేయించడం కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేశారని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఆ ఒక్క సీన్ కి ఆ స్థాయిలో ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఖర్చుకు తగ్గట్లుగా ఆ సీక్వెన్స్ సినిమాను చూసిన ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. ఖచ్చితంగా సినిమా ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు. ఆ సీన్‌తో సినిమా చాలా వరకు నిలబడిందని కూడా కొందరు రివ్యూల్లో పేర్కొన్న విషయం తెల్సిందే.
బాలీవుడ్ మూవీ థామా కలెక్షన్స్
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందిన ఆ సీన్ ఇలాంటి సినిమాలో పడటం ఎంత వరకు కరెక్ట్ అని కొందరు అంటున్నారు. ఆ సీన్‌కి తగ్గట్లుగా ఇతర సినిమా లేదు అనేది కొందరి విశ్లేషణ. మొత్తానికి థామా సినిమా భయపెడుతుంది అనుకున్న స్థాయిలో భయపెట్టలేదు. అందుకే సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. ఇప్పటి వరకు సినిమా రూ.140 కోట్ల వసూళ్లు రాబట్టిందని వార్తలు వస్తున్నాయి. అయితే సినిమాకు నిర్మాతలు రూ.150 కోట్లకు అటు ఇటుగా ఖర్చు చేసినట్లు బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పెట్టిన బడ్జెట్‌కి వచ్చిన కలెక్షన్స్ మధ్య ఎక్కువ తేడా లేకపోవడంతో ఈ సినిమాను డిజాస్టర్‌గా అనుకోనక్కర్లేదు. ఒక మంచి డీసెంట్ ఫిల్మ్‌గానే రష్మిక అభిమానులు, ఆయుష్మాన్ ఖురానా అభిమానులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు.
రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్
రష్మిక మందన్న ఈ ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దాడి చేస్తూనే ఉంది. ఛావా, కుబేర సినిమాలతో హిట్ కొట్టిన రష్మిక సికిందర్ సినిమాతో డిజాస్టర్ చవిచూసింది, అయితే థామా సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. మరికొన్ని రోజుల్లో రష్మిక మందన్న నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాపై చాలా ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు పెరిగాయి. నట విశ్వరూపంను రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో చూపించబోతుంది అంటూ అంతా నమ్ముతున్నారు. అంతే కాకుండా సినిమాలోని కథ, కథనం ఆకట్టుకునే విధంగా ఉంటుందని ట్రైలర్‌ను చూస్తే అనిపిస్తుంది. రావు రమేష్ తో పాటు ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.
