Begin typing your search above and press return to search.

రష్మిక కొత్త మూవీ.. తెలుగులో సౌండ్ లేదేంటి?

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   24 Oct 2025 4:00 AM IST
రష్మిక కొత్త మూవీ.. తెలుగులో సౌండ్ లేదేంటి?
X

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రాలతో టాప్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో సత్తా చాటుతున్న అమ్మడు.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. నార్త్ టు సౌత్ వివిధ చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వర్క్ చేస్తున్నారు రష్మిక.

రీసెంట్ గా పుష్ప-2, చావా వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న అమ్మడు.. త్వరలో గర్ల్ ఫ్రెండ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరిన్ని చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు థామా సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానాతో ఆమె కలిసి నటించిన మూవీని ఆదిత్య సర్పోదార్ దర్శకత్వం వహించారు.

మడోక్ హారర్ కామెడీ యూనివర్స్‌ లో భాగంగా థామా మూవీని ఇటీవల చిత్రాలతో ఫుల్ జోష్ లో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ మడోక్ ఫిలింస్ బ్యానర్‌ పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21వ తేదీన వరల్డ్ వైడ్‌ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు.

అయితే థామా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అయినా.. అసలు ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు. కేవలం రెండు రోజుల్లో రూ.35 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అది చాలా తక్కువనే చెప్పాలి. రష్మిక హీరోయిన్ గా నటించినప్పటికీ ఎలాంటి ప్రభావం కనిపించలేదు. అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేదు.

అందుకు ముఖ్య కారణం ప్రమోషన్స్. ఎందుకంటే థామా మేకర్స్ తెలుగులో పెద్ద సందడి చేయలేదు మేకర్స్. కేవలం ఒక్క ఈవెంట్ మాత్రమే హైదరాబాద్ లో నిర్వహించారు. అదే సమయంలో దీపావళి కానుకగా నాలుగు తెలుగు చిత్రాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీంతో రష్మిక మూవీ విడుదల అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు.

ఏదేమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు. పోస్ట్ ప్రమోషన్స్ చేపడితే వసూళ్లు పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. మిక్స్ డ్ టాక్ వచ్చినా.. కాస్త ప్రమోషన్స్ తో సందడి చేస్తే కొందరు ఆడియన్స్ అయినా ఆకట్టుకుంటారు. రష్మిక కోసమైనా థియేటర్స్ కు వెళ్తారు. అదే సమయంలో ఆమె అయినా కనీసం పోస్ట్ ప్రమోషన్స్ చేపడితే కచ్చితంగా కలెక్షన్స్ లో పెరుగదల కనిపించే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.