Begin typing your search above and press return to search.

ర‌ష్మిక‌..త‌మ‌న్నాల‌ రిస్క్ అండ్ డెడికేషన్!

తాజాగా రష్మికా మందన, తమన్నా వంటి తారలు కూడా తాజా చిత్రాల ద్వారా నిరూపిస్తున్నారు.

By:  Srikanth Kontham   |   11 July 2026 11:00 PM IST
ర‌ష్మిక‌..త‌మ‌న్నాల‌ రిస్క్ అండ్ డెడికేషన్!
X

ఒక‌ప్పుడు యాక్షన్ అనగానే హీరోలకు మాత్రమే పరిమితమైన అంశంగా క‌నిపించేది. కానీ మారుతున్న కాలంతో పాటు హీరోయిన్ల దృక్పథం కూడా పూర్తిగా మారింది. ప్ర‌స్తుతం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ప్రాణాలకు తెగించి రిస్క్ తీసుకునే హీరోయిన్ల సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది. యాక్షన్ అంటే కేవలం ఫైట్ సీక్వెన్స్ మాత్రమే కాదని.. అది అంకితభావానికి .. శారీరక కఠోర శ్రమకు నిదర్శనమని ఇప్ప‌టికే చాలా మంది భామ‌లు ప్రూవ్ చేసారు. తాజాగా రష్మికా మందన, తమన్నా వంటి తారలు కూడా తాజా చిత్రాల ద్వారా నిరూపిస్తున్నారు.

ప్రస్తుతం రష్మికా మందన చేస్తున్న ప్రయోగాలు ప్రేక్ష‌కుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజా చిత్రం `మైసా` కోసం మ్మ‌డు పడుతోన్న కష్టం మామూలుది కాదు. అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌లలో డూప్ లేకుండా నటించడానికి రష్మిక సిద్ధపడటం ఆమెలోని ధైర్యానికి నిదర్శనం. నీటి అడుగున శ్వాసను నియంత్రించుకుంటూ స్టంట్స్ చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన పని. అలాంటి సాహసాన్ని స్వీకరించి పాత్ర కోసం తనను తాను మలుచుకోవడం ఆమె అంకిత‌భావాన్ని తెలియజేస్తోంది.

గ్లామర్ క్వీన్ తమన్నా కూడా `ది వన్` చిత్రం కోసం కత్తి తిప్పే యాక్షన్ అవతార్‌లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. కఠినమైన శిక్షణ తీసుకుని మరీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం వెనుక ఆమె పట్టుదల క‌నిపిస్తుంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా గాయాలయ్యే అవకాశం ఉన్నా? ఒక యాక్షన్ స్టార్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే అమ్మ‌డి తపన అంకితభావం ప్రశంసనీయం.

హీరోయిన్లు ఇలాంటి రిస్క్ తీసుకోవడం వెనుక ఉద్దేశం పాత్రను మరింత సహజంగా చూపించడం. గతంలో కేబుల్ వైర్ల సహాయంతో చేసే ఫైట్లు ఒక ఎత్తయితే? ఇప్పుడు బాడీ లాంగ్వేజ్‌లో సహజత్వాన్ని తీసుకురావడానికి వారు చేస్తున్న కష్టం మరో ఎత్తు. కఠినమైన వర్కవుట్లు, మార్షల్ ఆర్ట్స్ , స్టంట్ మాస్టర్ల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకోవడం తప్పనిసరి అయింది. ఈ మార్పు వారి కెరీర్‌కే కాకుండా? తెలుగు సినిమా యాక్షన్ స్థాయిని కూడా పెంచుతోంది.

ఇలాంటి సాహసాలు చేయడం వల్ల హీరోయిన్ల మార్కెట్ పరిధి కూడా మారుతోంది. కేవలం కథానాయికగానే కాకుండా యాక్షన్ హీరోయిన్ గా కూడా ప్రేక్షకుల దృష్టిలో నిలుస్తున్నారు. ఇది ద‌ర్శ‌క‌, నిర్మాత‌లకు కూడా భిన్నమైన కథాంశాలను రాసుకోవడానికి ఊపిరినిస్తుంది. రష్మిక, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు ఇలాంటి ప్రమాదకరమైన యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించడం వల్ల చిన్న హీరోయిన్లు కూడా అలాంటి పాత్రలు చేయడానికి ధైర్యంగా ముందుకొస్తారు.

యాక్షన్ అనేది కేవలం పురుషాధిక్య రంగం కాదు. ప్రతిభ , పట్టుదల ఉంటే ఎవరైనా ? ఆ జానర్‌లో రారాణిగా వెల‌గొచ్చ‌ని రష్మిక, తమన్నా నిరూపిస్తున్నారు. తెరపై చూసే సెకను నిడివి గల యాక్షన్ సీన్ వెనుక వారి కన్నీళ్లు, చెమట ,ఎముకలు విరిగే శ్రమ దాగి ఉన్నాయి. వారిలోని ఈ డెడికేషన్ .. రిస్క్ తీసుకునే గుణం తెలుగు చలనచిత్ర పరిశ్రమను భవిష్యత్తులో గ్లోబల్ స్థాయిలో నిలబెట్టే దిశగా సాగుతున్నాయి.