టాలీవుడ్ నెంబర్ వన్ ఆవిడేనా?
టాలీవుడ్ హీరోయిన్లతో నెంబర్ వన్ స్థానం ఎవరిదంటే? ఇంత వరకూ ఓ సస్పెన్స్ కనిపించేది. మళ్లీ అనుష్క వస్తుంది.
By: Srikanth Kontham | 24 Sept 2025 4:00 AM ISTటాలీవుడ్ హీరోయిన్లతో నెంబర్ వన్ స్థానం ఎవరిదంటే? ఇంత వరకూ ఓ సస్పెన్స్ కనిపించేది. మళ్లీ అనుష్క వస్తుంది. కంబ్యాక్ అవుతుంది? అనే ఓ నమ్మకంతో అంతా ఆమెనే నెంబవర్ వన్ గా భావించారు. కానీ ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అనుష్క నటించిన రీసెంట్ రిలీజ్ `ఘాటీ` కూడా ప్లాప్ అయింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో కొత్త ప్రాజెక్ట్ లు ఏవీ లేవు. మళ్లీ ఎప్పుడు కంబ్యాక్ అవుతుందో కూడా గ్యారెంటీలేదు. ఆమె రూప లావణ్యంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే? అనుష్క నెంబర్ వన్ స్థానం నుంచి ఎగ్జిట్ అయినట్లే.
మరి ఇప్పుడా స్థానం ఎవరిది? పోటీలో ఎంత మంది భామలున్నారు? అంటే ఆస్థానం నేషనల్ క్రష్ రష్మికా మందన్నాకి కట్టబెట్టాల్సిందే. ఆమె అందుకున్న విజయాలు...తీసుకుంటోన్న పారితోషికం..టాలీవుడ్ లో ఆమెకున్న క్రేజ్..బాలీవుడ్ లో అందుకుంటోన్న అవకాశాలు ఇవన్నీ రష్మిక నే సూచిస్తున్నాయి. `పుష్ప` తో పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. అటుపై `యానిమల్` తో మరో సంచలనంగా మారింది. `పుష్ప 2` తో పాన్ ఇండియా లో ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. `కుబేర` లాంటి సంచలన విజయం అందుకుంది. `ఛావా`తో బాలీవుడ్ లో మరోసారి సత్తా చాటింది. ఈ విజయాలే అమ్మడిని అగ్ర పధాన నిలబెట్టాయి.
ప్రస్తుతం అమ్మడి లైనప్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. తెలుగులో `ది గర్ల్ ప్రెండ్` అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రం చేస్తోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మంచి బజ్ తీసు కొచ్చాయి. ఊపు చూస్తుంటే? సోలోగా బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బాలీవుడ్ం లో `థామా`, `కాక్ టెయిల్` లాంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇవిగాక బాలీవుడ్ స్టార్ హీరోలంతా అమ్మడితో కలిసి నటిం చడానికి రెడీగా ఉన్నారు. అగ్ర దర్శకులు, నిర్మాణ సంస్థలు రష్మిక డేట్లు కోసం ఎదురు చూస్తున్నాయి.
ఇంత బిజీగా సౌత్ నుంచి ఏ నటి బిజీగా లేదు. పారితోషికం సైతం రెండు భాషల్లోనూ భారీగానే అందుకుంది. బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడంలో రష్మిక ముందుంది. ఆ రకంగానూ అమ్మడి ఖాతాలో మంచి ఆదాయం జమ అవుతుంది. తెలుగు అవకాశాలు మరిన్ని వస్తున్నా రష్మిక కమిట్ అవ్వలేనంత బిజీగా ఉంది. సామాజిక మధ్య మాల్లోనూ భారీ ఫాలోయింగ్ ఉన్న నటి. ఇంతకు మించి నెంబర్ వన్ స్థానానికి కావాల్సిన అర్హతలేంటి.
