Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : మాస్‌ పిల్లతో గర్ల్‌ఫ్రెండ్‌ కలయిక..!

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్‌ మధ్య పోటీ ఎప్పుడూ ఉంటుంది. అప్పటి హీరోయిన్స్ మొదలుకుని ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ వరకు అందరిలోనూ ఒకరిపై ఒకరికి ఈర్ష్య అసూయ ఉంటుంది అంటారు.

By:  Ramesh Palla   |   4 Nov 2025 12:20 PM IST
పిక్‌ టాక్‌ : మాస్‌ పిల్లతో గర్ల్‌ఫ్రెండ్‌ కలయిక..!
X

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్‌ మధ్య పోటీ ఎప్పుడూ ఉంటుంది. అప్పటి హీరోయిన్స్ మొదలుకుని ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ వరకు అందరిలోనూ ఒకరిపై ఒకరికి ఈర్ష్య అసూయ ఉంటుంది అంటారు. అయితే కొందరు హీరోయిన్స్‌లో మాత్రం అలాంటివి కనిపించవు. ముఖ్యంగా తరం స్టార్‌ హీరోయిన్స్‌ అయిన రష్మిక మందన్న, శ్రీలీల చాలా క్యూట్‌గా యాక్టివ్‌గా ఉంటారు. ఇద్దరూ ఎలాంటి అసూయ, ద్వేశం వంటివి లేకుండా కూల్‌గా కనిపిస్తూ ఉంటారు. అందరితో స్నేహంగా ఉండటం వల్ల వీరు అందరి అభిమానంను సొంతం చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో వీరికి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరు ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్నాయి. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ సందడి చేస్తున్న వీరిద్దరు కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఉంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు అనడంలో సందేహం లేదు.

ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా రిలీజ్‌...

అలాంటి ఫ్రేమ్‌ తాజాగా క్రియేట్‌ అయింది. ప్రస్తుతం ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రష్మిక మందన్న బిజీ బిజీగా ఉంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్లాన్‌ చేశారు. రష్మిక మందన్నతో పాటు దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. వీరిద్దరితో పాటు ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో మాస్ జాతర బ్యూటీ మాస్‌ పిల్ల శ్రీలీల సైతం పాల్గొంది. రష్మికతో శ్రీలీల పెట్టిన ముచ్చట్లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు, ఇద్దరూ తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటే చాలా అందంగా ఉన్నారు అంటూ నెటిజన్స్ వీరిద్దరూ ఉన్న వీడియోను తెగ లైక్ చేస్తూ కామెంట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ చేస్తున్నారు.

రష్మిక మందన్నతో శ్రీలీల ఇంటర్వ్యూ....

ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమాను నవంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో దీక్షిత్‌ శెట్టి హీరోగా నటించాడు. రావు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో రష్మిక మందన్న తన నటనతో ఆకట్టుకుంది. విభిన్నమైన కథతో ఈ సినిమాను రూపొందించినట్లుగా ట్రైలర్‌తో అర్థం అవుతుంది. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ కి సెన్సిబుల్‌ దర్శకుడు అనే పేరు ఉంది. ఆ పేరుకు తగ్గట్లుగా మంచి కంటెంట్‌ను ఈ సినిమాలో దర్శకుడు అందించబోతున్నాడు అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న కారణంగా అంచనాలు, ఆసక్తి మరింతగా పెరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు.

మాస్ జాతర సినిమా తర్వాత శ్రీలీల మరో సినిమా...

ఇక మాస్ జాతర సినిమాతో మరోసారి శ్రీలీల తన నటన, డాన్స్‌తో మెప్పించింది. రవితేజ ఎనర్జిని మ్యాచ్‌ చేస్తూ శ్రీలీల చేసిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో మాత్రమే కాకుండా శ్రీలీల తమిళ్‌, హిందీ సినిమాలు సైతం ప్రస్తుతం లైన్‌లో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో శ్రీలీల బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతుంది. అంత బిజీగా ఉన్న శ్రీలీల తనకు ఇష్టమైన నటి రష్మిక మందన్న సినిమా ప్రమోషన్ కోసం తన వంతు సాయం అన్నట్లుగా ఇలా ఒకే స్క్రీన్‌ కి రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వీరిద్దరు కలిసి ముందు ముందు సినిమాలు చేయాలని, స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇద్దరికీ కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలతో మంచి అనుబంధం ఉంది. కనుక వీరిద్దరు అలా కనెక్ట్‌ అయ్యి ఉంటారు అని చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు.