విజయ్ దేవరకొండ రొమాన్స్.. తెగ సిగ్గు పడిపోయిన రష్మిక..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది.
By: Priya Chowdhary Nuthalapti | 21 Oct 2026 11:45 AM ISTవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. వీళ్ళిద్దరి చిన్న వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది.
తాజాగా రణబాలి సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఈ జంట సందడి చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో విజయ్, రష్మిక మధ్య జరిగే సరదా సంభాషణలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విజయ్ చెప్పిన రొమాంటిక్ మాటలకు రష్మిక సిగ్గుపడటం ఆసక్తికరంగా మారింది.
రణబాలి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక అభిమాని విజయ్‌ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. మీ జీవితంలో రష్మికతో గడిపిన బెస్ట్ మెమరీ ఏది అని ప్రశ్నించారు.
దీనికి విజయ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. కొంచెం రొమాంటిక్‌గా అనిపించినా తన మనసులోని మాటను విజయ్ చాలా సింపుల్‌గా చెప్పారు. తనను రోజు చూడడమే నా బెస్ట్ మెమరీ అంటూ చాలా రొమాంటిక్గా ఆన్సర్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. రష్మికను ప్రతిరోజూ చూడటమే తనకు అత్యుత్తమ జ్ఞాపకమని ఆయన చెప్పుకొచ్చారు.
విజయ్ చెప్పిన ఈ మాటలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రష్మిక ఇచ్చిన రియాక్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది.
విజయ్ తన గురించి అంత రొమాంటిక్‌గా మాట్లాడటంతో రష్మిక సిగ్గుపడింది. వెంటనే విజయ్ వెనుకకు వెళ్లి దాక్కుంది. ఆమె ముఖంలో కనిపించిన సిగ్గు, నవ్వు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇలాంటి సరదా క్షణాలు తరచుగా కనిపిస్తుంటాయి. అందుకే వీరి జంటకు సోషల్ మీడియాలోనూ మంచి ఆదరణ ఉంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన రణబాలి సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా ప్రమోషన్స్‌లో వీరిద్దరూ కలిసి పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
సినిమా గురించి మాట్లాడటంతో పాటు అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇక సినిమా కన్నా కూడా వీళ్ళిద్దరి ప్రమోషనల్ వీడియోస్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.
