Begin typing your search above and press return to search.

షిర్డీలో రష్మిక సందడి.. ఆయనతో కలిసి ప్రత్యేక పూజలు!

వైట్ చుడిదార్ లో చాలా సాంప్రదాయంగా రష్మిక కనిపించగా.. అటు ఆయుష్మాన్ ఖురానా కూడా కుర్తిలో మరింత ట్రెడిషనల్ గా కనిపించారు.

By:  Madhu Reddy   |   14 Oct 2025 6:03 PM IST
షిర్డీలో రష్మిక సందడి.. ఆయనతో కలిసి ప్రత్యేక పూజలు!
X

ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న తాజాగా షిరిడీలో దర్శనమిచ్చారు. అక్కడ ఆయనతో కలిసి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా నటిస్తున్న చిత్రం థామా.. హార్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా.. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా బాబా ఆశీస్సులు పొందడానికి చిత్ర బృందం షిరిడీలో దర్శనమిచ్చారు.

వైట్ చుడిదార్ లో చాలా సాంప్రదాయంగా రష్మిక కనిపించగా.. అటు ఆయుష్మాన్ ఖురానా కూడా కుర్తిలో మరింత ట్రెడిషనల్ గా కనిపించారు. ఇక స్వామివారి పాదాల ముందు తలవాల్చి తమ సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా థామా సినిమా విడుదల సందర్భంగా ఇలా చిత్ర బృందం మొత్తం షిరిడీలో సాయిబాబాను దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఇది చూసి.. బాబా ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటాయి.. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

రష్మిక విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె.. 2014లో మోడలింగ్ ప్రారంభించింది. అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఆఫ్ ఇండియా టైటిల్ గెల్చుకున్న ఈమె.. క్లీన్ అండ్ క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసింది. ఆ తర్వాత కిరిక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. తెలుగులో తొలిసారి ఛలో సినిమా ద్వారా పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత గీతాగోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్ , సరిలేరు నీకెవ్వరు అంటూ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాతో 2021 లో సంచలనం సృష్టించిన ఈమె.. ఆ తర్వాత నుంచి చేస్తున్న ప్రతి సినిమా కూడా ఈమెకు మంచి విజయాన్ని అందించింది. అలా పుష్ప 2, ఛావా, యానిమల్, కుబేర ఇలా వరుస చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మూడువేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

ప్రస్తుతం ఈమె చేతిలో గర్ల్ ఫ్రెండ్, థామా, రెయిన్బో, మైసా వంటి చిత్రాలు ఉన్నాయి. అలాగే వెంకి కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎక్కువగా తెలుగు, తమిళ్ భాషలలో ఫోకస్ పెడుతున్న ఈమె ఈమధ్య హిందీ పై కూడా ధ్యాస పెట్టింది. అక్కడే పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.