అందరి గర్ల్ ఫ్రెండ్ అంటే దేవరకొండ ఒప్పుకుంటాడా..?
రష్మిక హూజ్ ద గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ ఎవరీ వన్.. ఏంటిది ఇలా ఎవరైనా చెబుతారా అంటే ఎవరో చెప్పడం కాదు నేషనల్ క్రష్ రష్మికానే ఈ కామెంట్ చేసింది.
By: Ramesh Boddu | 2 Nov 2025 12:30 PM ISTరష్మిక హూజ్ ద గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ ఎవరీ వన్.. ఏంటిది ఇలా ఎవరైనా చెబుతారా అంటే ఎవరో చెప్పడం కాదు నేషనల్ క్రష్ రష్మికానే ఈ కామెంట్ చేసింది. అదేంటి అలా అంటే ఆమె మనసు గెలిచిన వాడు బాధపడడా అంటున్నారు.. విషయం ఏంటంటే రష్మిక లేటెస్ట్ గా బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో వీకెండ్ ఎపిసోడ్ లో స్టార్ సందడి తెలిసిందే. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న తను నటించిన గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ కోసం వచ్చింది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం బిగ్ బాస్ వచ్చిన రష్మికను చూసి ఆడియన్స్ సర్ ప్రైజ్ అయ్యారు.
రష్మికగా వచ్చావా.. గర్ల్ ఫ్రెండ్ గా వచ్చావా..
ఇక స్టేజ్ మీద హోస్ట్ నాగార్జున నువ్వు రష్మికగా వచ్చావా.. గర్ల్ ఫ్రెండ్ గా వచ్చావా అని అంటాడు. దానికి రష్మిక ఆన్సర్ ఇస్తూ నేను అందరి గర్ల్ ఫ్రెండ్ అని అన్నది. ఇక ఆమెతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ లీడ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి కూడా అటెండ్ అయ్యాడు. ఐతే ఈ ఇద్దరినీ నాగార్జున హౌస్ మెట్స్ కి పరిచయం చేశారు. రష్మికని చూసి హౌస్ మెట్స్ అంతా సర్ ప్రైజ్ అయ్యారు. సండే ఎంటర్టైన్మెంట్ లో భాగంగా హౌస్ మెట్స్ తో సినిమాలోని కొన్ని సీన్స్ రీక్రియేట్ చేయమనే టాస్క్ ఇచ్చారు.
అందులో పోకిరి లిఫ్ట్ సీన్ తో పాటు అదుర్స్ సీన్ ఇలా కొన్ని చేయించారు. హౌస్ లో ఎప్పుడు సండే ఎపిసోడ్ డబ్స్మాష్ లా కాకుండా ఇలా కొత్తగా సీన్ రీ క్రియేషన్ ఆడియన్స్ కి కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ సండే ఎపిసోడ్ కచ్చితంగా ఆడియన్స్ కి సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉంది. ముఖ్యంగా రష్మిక ఫ్యాన్స్ ఆమె ఎంట్రీ కోసమైనా షో చూసేలా ఉన్నారు.
బిగ్ బాస్ స్టేజ్ మీద రష్మిక..
ఐతే అంతా బాగుంది కానీ బిగ్ బాస్ స్టేజ్ మీద రష్మిక హూజ్ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ ఎవరీ వన్ అని అనడం ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఐతే ఆ మాట అంటే తను ఎంగేజ్ అయిన మన దేవరకొండ ఒప్పుకుంటాడా అని కామెంట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు ఎంగేజ్ అయిన విషయం తెలిసిందే. ఐతే ఇద్దరు ఆ విషయాన్ని ఒక మంచి ముహూర్తంలో ఎనౌన్స్ చేయాలని చూస్తున్నారు.
అంతేకాదు రష్మిక గర్ల్ ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ అటెండ్ అవుతాడని టాక్. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమాతో రష్మిక ఒక సూపర్ హిట్ కొట్టాలని చూస్తుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అమ్మడు అదరగొట్టేస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు వీడీ 14, మైసా సినిమాల్లో రష్మిక నటిస్తుంది.
