ఐకాన్ స్టార్ మూవీతో రష్మిక సరికొత్త అడుగు?
'పుష్ప 2' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న బన్నీ ఈ సారి దానికి మించిన సినిమాతో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
By: Tupaki Entertainment Desk | 7 Feb 2026 6:32 PM IST'పుష్ప 2' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న బన్నీ ఈ సారి దానికి మించిన సినిమాతో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగానే పాన్ ఇండియాకు మించి పాన్ వరల్డ్ స్టోరీతో సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడు. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకునే ఇందులో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. #AA22xA6 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గని విధంగా హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ మూవీ కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని రంగంలోకి దించేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీలో దీపిక పదుకునే తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా నటిస్తోంది. అధికారికంగా టీమ్ ఈ విషయాన్ని వెల్లడించలేదు కానీ రష్మిక మాత్రం ఈ మూవీ సెట్‌లోకి తాజాగా అడుగుపెట్టింది. అల్లు అర్జున్, రష్మిక, `కుబేర` ఫేమ్ జిమ్ సర్భ్ లు పాల్గొనగా పలు కీలక యాక్షన్ ఘట్టాలని ఇండోర్ సెట్టింగ్స్‌లో చిత్రీకరిస్తున్నారు. అట్లీ అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ మూవీలో బన్నీ సూపర్ హీరో తరహా క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు.
తనకు తగ్గ స్థాయిలో రష్మిక క్యారెక్టర్ కూడా ఇందులో సాగుతుందని, తనపై కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం రష్మికని బన్నీ రిఫర్ చేశాడని, తన క్యారెక్టర్ ఈ మూవీలో నెగెటీవ్ షేడ్స్‌తో సాగుతుందని ఇన్ సైడ్ టాక్. అదే నిజమైతే రష్మిక అటెమ్ట్ చేస్తున్న మరో సరికొత్త తరహా క్యారెక్టర్ అవుతుందని, తన కెరీర్‌కి మరో కొత్త అడుగు అవుతుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
రష్మిక క్యారెక్టర్ ఇందులో పూర్తి స్థాయిలో నెగెటివ్ షేడ్స్‌తో ఉండదని, కథలో గ్రే షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తనతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోందని ప్రచారం జరుగుతున్నా.. పలు ఇండికేషన్‌లు కనిపిస్తున్నా తాను మాత్రం ఇందులో నటించడం లేదని చెబుతూ వస్తోంది. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నా ఈ మూవీకి జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీని, రూబెన్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు.
