ఆ నొప్పి, బాధ వారు కూడా అనుభవించాలి..
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా తమ సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి రియాల్టీ షోలలో పాల్గొంటూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 5 Nov 2025 3:15 PM ISTఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా తమ సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి రియాల్టీ షోలలో పాల్గొంటూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. మరి కొంతమంది టాప్ షోలలో కూడా పాల్గొంటూ ఆకట్టుకుంటున్నారు. అందులో భాగంగానే నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా నటిస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నవంబర్ 7వ తేదీన తెలుగు ,హిందీ భాషల్లో విడుదల కానుండగా.. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో నవంబర్ 14వ తేదీన రిలీజ్ కాబోతోంది.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కన్నడ హీరో దీక్షిత్ శెట్టి లీడ్రోల్ పోషిస్తూ వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక జోరుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇదివరకే బిగ్ బాస్ సీజన్ 9 షోలో గెస్ట్ గా పాల్గొని తన సినిమాను ప్రమోట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు జగపతిబాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి విచ్చేసింది. ఎపిసోడ్లో భాగంగా ఆ నొప్పి, బాధ, నరకం మగవారు కూడా అనుభవించాలి అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి మరి రష్మిక ఎందుకు అలాంటి కామెంట్స్ చేసింది అనే విషయం ఇప్పుడు చూద్దాం..
సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే రష్మిక చిన్ననాటి విషయాలను... ఆమె కెరియర్ , సినిమా , వ్యక్తిగత విషయాలు అన్నింటినీ పంచుకుంది. అలాగే జగపతిబాబు ఆమె కోరికను కూడా బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. జగపతిబాబు మాట్లాడుతూ.. మగవారికి కూడా పీరియడ్స్ రావాలని గట్టిగా అనుకున్నట్టు ఉన్నావు కదా! అని ప్రశ్నించగా.. అవును మగవారికి కూడా పీరియడ్స్ రావాలి ?.. అప్పుడే ఆడవారు పడే బాధ, నరకం వారికి తెలుస్తుంది. పీరియడ్స్ వచ్చినప్పుడు మహిళలు పడే ఇబ్బంది ఏంటో తెలుస్తుంది అంటూ చాలా ఘాటుగా కామెంట్లు చేసింది రష్మిక మందన్న. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇక రష్మిక విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె కిరిక్ పార్టీ అనే సినిమా చేసింది..ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. అయితే ఈ సినిమా సమయంలోనే ఇతడితో ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకున్న రష్మిక అనూహ్యంగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కిరిక్ పార్టీ తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో అంజనీపుత్ర, గణేష్ తో ఒక సినిమా చేసిన ఈమె తెలుగులో నాగశౌర్య హీరోగా నటించిన చలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుడిని పలకరించింది ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు వంటి వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది.
పుష్ప, పుష్ప 2 ,యానిమల్, ఛావా, కుబేర, థామా, సికందర్ అంటూ వరుసగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరించిన ఈమె ఇప్పుడు మైసా , రెయిన్బో చిత్రాలను లైన్ లో ఉంచింది
