వర్కింగ్ అవర్స్.. రష్మిక ఆలోచన ఎలా ఉందంటే?
ఆ తర్వాత ఫ్యూచర్ కోసం మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు రష్మిక. తనకు పిల్లలు పుడతారని, అది చాలా ఇష్టమని అన్నారు.
By: M Prashanth | 28 Oct 2025 7:51 PM ISTస్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కొంత కాలంగా సూపర్ హిట్స్ ను సొంతం చేసుకుంటున్నారు. అదే సమయంలో నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు.
ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వర్క్, లైఫ్ బ్యాలెన్స్ తోపాటు నటీనటులు మరీ ఎక్కువగా పని చేయడం వంటి విషయాలపై ఓపెన్ గా మాట్లాడారు నేషనల్ క్రష్. అంతే కాదు సరిగా నిద్ర కూడా లేకపోవడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఎప్పుడైనా ఓవర్ వర్క్ చేయడం మంచిది కాదని సూచించారు రష్మిక. తాను ఎప్పుడూ ఓవర్ వర్క్ చేస్తానని చెప్పిన అమ్మడు.. ఎవరూ మాత్రం అలా చేయద్దని కోరారు. కంఫర్ట్ బట్టి వర్క్ చేయాలని అన్నారు. డైలీ 8, 9, లేదా 10 గంటల నిద్రపోవాలని, ఎందుకంటే అది మీకు భవిష్యత్తులో చాలా సహాయపడుతుందని చెప్పారు.
ఇటీవల పని గంటల విషయంలో చర్చలు విన్నానని తెలిపారు. అయితే ఒకవేళ తమకు కూడా పని చేయగలిగిన గంటలను ఎంపిక చేసుకోమని అడిగితే.. ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉంటాయో అలాగే చేస్తానని చెప్పారు రష్మిక. ఆఫీస్ టైమింగ్స్ 9-6 లేదా 9-5 లేదా 9-4 ఎలా ఉంటాయో మీకు తెలుసన్న ఆమె.. తమకు కూడా అలాగే ఉండనివ్వండని కోరారు.
"ఎందుకంటే నేను నా కుటుంబ జీవితంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఇంకా నిద్రపోవాలనుకుంటున్నాను. వర్కౌట్ కూడా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్న వయస్సులో ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండి వర్కౌట్ చేయలేదని తర్వాత పశ్చాత్తాపపడకూడదు. ప్రస్తుతం అది నా చేతుల్లో లేదు" అని రష్మిక చెప్పింది.
ఆ తర్వాత ఫ్యూచర్ కోసం మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు రష్మిక. తనకు పిల్లలు పుడతారని, అది చాలా ఇష్టమని అన్నారు.
పిల్లల కోసం తాను ఇప్పటికే ఏదో అనుభూతి చెందుతున్నానని, వారి కోసం ప్రతిదీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. వారిని చాలా సురక్షితంగా ఉంచాలనుకుంటున్నానని, తాను ముందుగా ఫిట్ గా ఉండాలని చెప్పుకొచ్చారు.
"20 నుండి 30 సంవత్సరాల వయస్సులో మనం పని చేస్తూ ఉండాలని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. అలాగే 30 నుండి 40 సంవత్సరాల వయస్సులో, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయాలి. అది జరిగేలా చూసుకోవాలి. 40 సంవత్సరాల తర్వాత మనకు తెలియదు. నేను ఇంకా అంత దూరం ఆలోచించలేదు" అని రష్మిక తెలిపారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.
