Begin typing your search above and press return to search.

రియ‌ల్ లైఫ్ లో వీడీకి..రీల్ లైఫ్ లో అత‌డికి వైఫ్!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా- విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేమ వివాహం చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   17 Feb 2026 9:30 AM IST
రియ‌ల్ లైఫ్ లో వీడీకి..రీల్ లైఫ్ లో అత‌డికి వైఫ్!
X

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా- విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేమ వివాహం చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రికొన్ని రోజుల్లోనే భార్యా భ‌ర్త‌లుగా ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్ట‌బోతున్నారు. ఇంత‌కాలం ప్రేమికులుగానే ప్రేక్షకుల్లో ఉన్న జోడీ భార్య భార్త‌లుగా మార‌డం ప‌ట్ల‌ స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. మేడ్ ఫర్ ఈచ్ అద‌ర్ లా హైలైట్ అవుతున్నారు. వివాహం అనంత‌రం ఆ జంట జీవితం పిల్లా పాప‌ల‌తో సంతోషంగా సాగిపోవాల‌ని ప్రేక్ష కాభిమానులు కోరుకుంటున్నారు. వివాహం అనంత‌రం న‌టులుగా ఇద్ద‌రి కెరీర్ కి సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభం అయిన‌ట్లే.

అయితే ఇద్ద‌రు ఇంత వ‌ర‌కూ ఏ సినిమాలోనూ భార్య భ‌ర్త‌ల పాత్ర‌లో క‌లిసి న‌టించ‌లేదు. విజ‌య్ మాత్రం ప‌లు సినిమాల్లో భ‌ర్త పాత్ర‌లు పోషించాడు గానీ..ర‌ష్మిక మాత్రం ఏ సినిమాలోనూ ఏ హీరోకు భార్య పాత్ర పోషించ‌లేదు.

ఆ ర‌కంగా రియ‌ల్ లైఫ్ లోనూ భార్య పాత్ర‌తో తొలి అనుభ‌వాన్ని ఆస్వాదించ‌బోతుంది. అయితే వివాహం అనంత‌రం మాత్రం ఓ హీరోకి భార్య పాత్ర‌లో కూడా న‌టించ‌డానికి సిద్దంగా ఉంది అన్న విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం అమ్మ‌డు బాలీవుడ్ లో `కాక్ టెయిల్ 2` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. అయితే ఈ సినిమా అనంత‌రం మ‌ళ్లీ షాహిద్ క‌పూర్ కి జోడీగా మ‌రో సినిమాలో ర‌ష్మిక న‌టించ‌బోతుంది. ఈ చాత్రానికి `మైదాన్` ఫేం అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో షాహిద్ కపూర్ -ర‌ష్మికా మంద‌న్నా భార్యా భ‌ర్త‌ల పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇదొక సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం. వైవాహిక జీవితంలో గొడవలు పడుతూ విడాకుల దాకా వెళ్ళిన ఒక జంట జీవితంలోకి, ఒక సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్ వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి అనేదే ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది.

ఇలాంటి పాయింట్ తో ఇంత వ‌ర‌కూ ఏ సినిమా తెర‌కెక్క‌లేదు. భార్య భ‌ర్త‌ల బంధం మ‌ధ్య‌లో సైన్స్ ఫిక్ష‌న్ జోడించ‌డం అన్న‌డి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట‌ర్ గా చెప్పొచ్చు. గ‌తంలో శంక‌ర్ `రోబో` తో ఇద్ద‌రు ప్రేమికుల ఎడ‌బాటును పాక్షికంగా హైలైట్ చేసాడు. ర‌జ‌నీకాంత్ రోబో సినిమాలో సైంటిస్ట్. అందులో హీరోయిన్ గా న‌టించిన ఐశ్వ‌ర్యారాయ్ ప్రియుడి ప్రేమ‌ను కోరుకుంటుంది. కానీ ల్యాబ్ లో నిత్యం ప్ర‌యోగాల‌తో బిజీగా ఉండే డాక్ట‌ర్ ని అర్దం చేసుకోవ‌డంలో ప్రియురాలు విఫ‌ల‌మ‌వుతుంది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య చిన్న‌పాటి గ్యాప్ ఏర్ప‌డుతుంది. కానీ ఆ స‌న్నివేశాల్ని ఎంతో అందంగా, కొంటెంగా శంక‌ర్ చూపించాడు. అమిత్ శ‌ర్మ మాత్రం భార్య‌భ‌ర్త‌ల పాత్ర‌ల మ‌ధ్య‌లోనే కొత్త కోణాన్ని చెప్ప‌బోతున్నాడు.