Begin typing your search above and press return to search.

జాక్ పాట్ కొట్టిన రష్మిక.. ఏకంగా డబుల్!

అయితే ఈసారి ఏకంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్ర నిర్మాతలు సినిమా గురించి, సినిమాలో హైలెట్ గా నిలిచిన అంశాల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

By:  Madhu Reddy   |   1 Nov 2025 11:00 PM IST
జాక్ పాట్ కొట్టిన రష్మిక.. ఏకంగా డబుల్!
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కన్నడ హీరో దీక్షిత్ శెట్టి కాంబినేషన్లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7వ తేదీన తెలుగు , హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. నవంబర్ 14న తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో.. సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు చిత్ర బృందం. అయితే ఈసారి ఏకంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఈ చిత్ర నిర్మాతలు సినిమా గురించి, సినిమాలో హైలెట్ గా నిలిచిన అంశాల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి వారి మాటల్లోనే ఈ సినిమా హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.




ది గర్ల్ ఫ్రెండ్ నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ..

కోవిడ్ 19 సమయంలో థియేటర్లు క్లోజ్ అయ్యాయి. అయితే ఆ తరువాత థియేటర్స్ అన్ని అందుబాటులోకి వచ్చాయి. అప్పుడే స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో పడ్డాం. ఈ ప్రాజెక్టు తీసుకున్నప్పటి నుంచి థియేటర్ గానే వెళ్లేందుకు ప్లాన్ చేసాము. ప్రొడ్యూసర్ గా.. కమర్షియల్ గా మూవీ ఉండాలని కోరుకుంటాం కదా.. మేము రిస్క్ చేసినా పర్వాలేదు. స్టోరీ బాగుండాలి అనే నమ్మాను. మేము అనుకున్న దానికంటే స్టోరీ మమ్మల్ని మెప్పించింది.

విద్యాతో కూడా నాకు మంచి స్నేహబంధం ఏర్పడింది. నిర్మాణ వ్యయంలో పూర్తి నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడలేదు. లవ్ స్టోరీస్ ను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. అయితే ఈ కథ హీరోయిన్ కోణంలోనే ఉంటుంది. అందుకే స్టార్స్ ని ఇందులో హీరోగా తీసుకోలేదు. పర్ఫామెన్స్ ని మెయిన్ గా తీసుకొని దీక్షిత్ తీసుకున్నాము. దీక్షిత్ చాలా మంచి పెర్ఫార్మర్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళను కూడా నటించేలా ఆకట్టుకున్నాడు.

థియేట్రికల్ గా ఈ సినిమా చాలా బాగా వర్క్ అవుట్ అవుతుందని నమ్ముతున్నాము. అటు దీక్షిత్ ను తీసుకోవడం వల్ల కన్నడ మార్కెట్ కు కూడా ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు. ఆయన పాత్రకు ఆయన కరెక్ట్ గా సెట్ అవుతాడనే తీసుకున్నాము. అయితే రష్మిక , దీక్షిత్ కలిసి ఇందులో నటించడం వల్లే మాకు కన్నడలో కూడా అడ్వాంటేజ్ ఏర్పడింది.

ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ గతంలో చేసిన ప్రాజెక్టులు కాకుండా ఇప్పుడు కథ చూసి మేము ఆయన సినిమాను నిర్మించాము. రష్మిక ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోలేదు. కాబట్టి ఆ కృతజ్ఞతతోనే ఆమెకు రెట్టింపు పారితోషకం ఇస్తున్నాం. అను ఇమ్మానుయేల్ కూడా చాలా అద్భుతంగా నటించింది. సినిమా రిలీజ్ అంటే అందరిలో భయం ఉంటుంది. కానీ మాకు ఈ సినిమా పైన పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మేము టెన్షన్ లేకుండా ఉన్నాము.

రెండు రోజుల ముందే ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నాం.. ఎప్పుడు అనేది త్వరలోనే చెబుతాం అంటూ తెలిపారు. అలాగే గీత ఆర్ట్స్ అరవింద్ గారు మాకు మంచి సపోర్ట్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత మరో కొత్త ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేస్తామని తెలిపారు.

విద్య కొప్పినీడి మాట్లాడుతూ..

ఈ సినిమా కథ విన్నప్పుడే మేము స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాను.. రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కాదు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూశాక మంచి మెసేజ్ తీసుకుంటారు. కమర్షియల్ ఫార్మాట్ స్టోరీ కాకపోయినా రిస్క్ తీసుకోవాలని నేను ధీరజ్ అనుకున్నాము. సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్టర్ కి నేషనల్ అవార్డు దక్కుతుందని ప్రశంసలు కూడా లభించాయి.

ఇద్దరం ప్రొడ్యూసర్స్ కాబట్టి ప్రొడక్షన్ కు సంబంధించిన ఏ వర్క్ అయినా షేర్ చేసుకునే చేశాం. ప్రతి డెసిషన్ కలెక్టివ్ గా డిస్కస్ చేసి తీసుకున్నాం. స్టోరీస్ సెలెక్షన్ విషయంలోనూ ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకుంటాం. మా ప్రాజెక్ట్ వెనక అరవింద్ గారి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.

లవ్ స్టోరీస్ చూడటానికి బాగుంటాయి. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేస్తారు. లవ్ స్టోరీస్ లోనే ఏదైనా కొత్తగా ఉండి స్ట్రాంగ్ ఫీల్ ఉంటే అలాంటి సినిమాలు చేయాలని అనుకుంటాం. వుమెన్ సెంట్రిక్ అని కావాలని సెలెక్ట్ చేసుకున్నది కాదు కథ ఆ తరహాలో ఉంటుంది. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా రియల్ ఇన్సిడెంట్స్ తో ఇన్స్ పైర్ అయి రాసినా, మిగతా అంతా స్క్రిప్ట్ చేసుకున్నదే.

"ది గర్ల్ ఫ్రెండ్" సినిమా షూటింగ్ ఎక్కువగా ఒక కాలేజ్ లో చేశాం. వర్కింగ్ డేస్ లో కాలేజ్ లు ఇవ్వరు. అప్పటికి రశ్మిక రెండు మూడు బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాటి షూటింగ్ వేరే సిటీస్ లో జరిగేది. దాంతో కొంత డేట్స్ వల్ల డిలే అయ్యింది కానీ మిగతా అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండానే షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ చివరలో ఉండగా కార్మికుల సమ్మె వచ్చింది. సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది కాబట్టి మాకు పెద్దగా ప్రాబ్లమ్ కాలేదు.

సినిమా బిగినింగ్ లోనే హేషమ్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నాం. ఆయన మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాలుగు సాంగ్స్, రెండు బిట్ సాంగ్స్ ఉంటాయి. ఇది వుమెన్ సెంట్రిక్ మూవీ కాదు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ. సినిమా చూసిన ప్రేక్షకులంతా ఈ కథకు రిలేట్ అవుతారు. తమకు తెలిసిన వారి ప్రేమ కథలు వారికి గుర్తొస్తాయి.

ఈ ప్రాజెక్ట్ సమంత గారితో చేయాలని అనుకోలేదు. ఈ స్క్రిప్ట్ కు రశ్మిక గారినే అనుకున్నాం. ఆమెకు ఈ స్క్రిప్ట్ పర్సనల్ గా చాలా నచ్చింది. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఆమెతో ఎలాంటి డిస్కషన్స్ జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటికి పదిసార్లు ఆలోచించి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నాం. అరవింద్ గారు ఇచ్చే సలహా కూడా అదే.