Begin typing your search above and press return to search.

ముగ్గురయ్యామన్న రష్మిక.. అసలు విషయమిదేనా?

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.

By:  M Prashanth   |   3 April 2026 2:13 PM IST
ముగ్గురయ్యామన్న రష్మిక.. అసలు విషయమిదేనా?
X

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఆమె షేర్ చేసిన ఒక చిన్న యానిమేషన్ వీడియోతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ముఖ్యంగా ఇప్పుడు మేము ముగ్గురం అయ్యామంటూ ఇచ్చిన క్యాప్షన్ చుట్టూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇటీవల హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న రష్మిక.. పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ అభిమానులతో టచ్‌ లో ఉన్నారు. పెళ్లి ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతుండగా, ఈ కొత్త పోస్ట్ మాత్రం మరింత ఆసక్తిని రేకెత్తించింది. యానిమేషన్ వీడియోలో రష్మిక, విజయ్ కార్టూన్ రూపంలో కనిపిస్తారు. వీరి మధ్యలో ఒక చిన్న పొద్దుతిరుగుడు పువ్వు (సన్ ఫ్లవర్) ఉండటం ప్రత్యేకంగా కనిపించింది.

ఆ వీడియో చూసిన వెంటనే అభిమానులు తమదైన అర్థాలు చేసుకోవడం ప్రారంభించారు. కొందరు ఇది గుడ్ న్యూస్ కు సిగ్నలా? రష్మిక ప్రెగ్నెంటా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తే, మరికొందరు క్యూట్ కాన్సెప్ట్ అంటూ ప్రశంసించారు. అయితే, అసలు విషయం మాత్రం వేరేలా ఉంది. ఆ పోస్ట్‌ కు ప్రెగ్నెన్సీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది.

రష్మిక చాలా కాలంగా రూ అనే పొద్దుతిరుగుడు పువ్వు క్యారెక్టర్‌ తో ఒక ప్రత్యేక యానిమేషన్ ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని చెప్పాలి. ఆ క్యారెక్టర్ ఆమె వ్యక్తిత్వంలోని పాజిటివిటీ, ఉత్సాహాన్ని రిఫ్లెక్ట్ చేస్తోంది. ఆ యానిమేటెడ్ ప్రాజెక్ట్‌ ను ప్రముఖ కంటెంట్ ప్లాట్‌ ఫామ్ టెర్రబిలీ టైనీ టైల్స్ సహకారంతో రూపొందించారు. రష్మిక & రూ పేరుతో ఈ యానిమేషన్ సిరీస్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

ఇందులో రష్మిక, రూ మధ్య ఉన్న అనుబంధాన్ని క్యూట్ స్టోరీల రూపంలో చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ యానిమేషన్ ప్రపంచంలోకి విజయ్ ను కూడా తీసుకొచ్చారు. అంటే రష్మిక, రూ తోపాటు ఇప్పుడు విజయ్ కూడా డిజిటల్ ఫ్యామిలీ లో భాగమయ్యారు. క్యాప్షన్ కూడా దీనికి సంకేతం. అంటే, ఇది ఒక క్రియేటివ్ అనౌన్స్మెంట్ మాత్రమే కానీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్ కాదని స్పష్టమవుతోంది.

అదే సమయంలో వీడియోలో కనిపించిన గుడ్డు బొమ్మ, సన్ ఫ్లవర్ వంటి ఎలిమెంట్లు కూడా కేవలం యానిమేషన్ లో భాగమే. వీటిని వాస్తవ జీవితంతో లింక్ చేయాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అయితే ఆ చిన్న క్లిప్ మాత్రం అభిమానుల్లో పెద్ద చర్చలు రేపింది. మొత్తంగా, రష్మిక చేసిన పోస్ట్ ఒక క్రియేటివ్ అప్డేట్ మాత్రమే. అయితే అభిమానుల ఊహాగానాలతో అది పెద్ద సెన్సేషన్‌ గా మారింది. సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ కూడా ఎంత పెద్ద చర్చకు దారి తీస్తుందో మరోసారి స్పష్టమైంది. దీనిపై రష్మిక మళ్లీ స్పందిస్తారేమో వేచి చూడాలి.