అందరికీ తెలిసిందే.. రిలేషన్ షిప్ పై క్లారిటీ!
ఇక ఈ ప్రశ్నకు రష్మిక సిగ్గుపడుతూ మైక్ దగ్గర పెట్టుకొని గొంతు సరిచేసుకునే సమయంలోనే చాలామంది అక్కడికి వచ్చిన ప్రేక్షకులు రౌడీ రౌడీ అంటూ గట్టిగా కేకలు వేశారు.
By: Madhu Reddy | 25 Oct 2025 5:45 PM ISTవిజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్య ప్రేమాయణం గీతగోవిందం సినిమా షూటింగ్ సమయంలోనే ఏర్పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచి ఈ జంట చాలా సార్లు వెకేషన్ కి వెళ్ళిన సమయంలో ఒకే బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకొని మీడియాకి,అభిమానులకి లీకులు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా తమ రిలేషన్ గురించి ప్రేమ,పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఫస్ట్ టైం రష్మిక మందన్నా స్టేజ్ పై విజయ్ దేవరకొండ తో ఉన్న ప్రేమ గురించి అఫీషియల్ గా ప్రకటించేసింది. మరి స్టేజ్ మీద రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ మీద ఉన్న ప్రేమని ఎలా కన్ఫామ్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం..
రష్మిక మందన్నా ఈ మధ్యనే బాలీవుడ్ లో థామా అనే మూవీతో మన ముందుకు వచ్చింది. ఆయుష్మాన్ ఖురానా తో రష్మిక కలిసి నటించిన ఈ సినిమా అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే మరో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ హీరోయిన్ నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా నవంబర్ 7న విడుదల కాబోతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటూ సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అందరు పాల్గొని సందడి చేశారు.అయితే ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి అందరూ గొప్పగా చెబుతూ ఉండగా వెంటనే యాంకర్ మైక్ అందుకొని వాట్ ఈజ్ రష్మికాస్ టైప్.. హూ ఈజ్ రష్మికాస్ టైప్ అంటూ ప్రశ్నించింది.
ఇక ఈ ప్రశ్నకు రష్మిక సిగ్గుపడుతూ మైక్ దగ్గర పెట్టుకొని గొంతు సరిచేసుకునే సమయంలోనే చాలామంది అక్కడికి వచ్చిన ప్రేక్షకులు రౌడీ రౌడీ అంటూ గట్టిగా కేకలు వేశారు. ఇక వాళ్ళ అరుపులకి ఇక చెప్పేదేముంది..అందరికీ తెలిసిందే కదా అదే అన్నట్లుగా క్లారిటీ ఇచ్చేసింది. దాంతో యాంకర్ అక్కడి నుంచే ఆన్సర్ వచ్చిందంటా అంటూ చెప్పింది. అలా స్టేజ్ మీదే రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఉన్న రిలేషన్ ని అఫీషియల్ గా ఒప్పుకుంది రష్మిక.
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ రీసెంట్ గా అంటే అక్టోబర్ 4 న విజయ్ దేవరకొండ ఇంట్లో అత్యంత తక్కువ సన్నిహితుల మధ్యలో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు వార్తలు వినిపించాయి.అయితే ఇప్పటివరకు ఎంగేజ్మెంట్ ఫోటోలు గానీ అధికారిక ప్రకటన గాని ఈ జంట ఇవ్వకపోయినప్పటికీ ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి వీరిద్దరి చేతి వేళ్లకు ఉన్న రింగ్స్ మాత్రం హైలెట్ గా నిలవడంతో వీరిద్దరి ఎంగేజ్మెంట్ నిజమే అని చాలామంది క్లారిటీకి వచ్చారు. అలా రష్మిక మందన్నా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు కూడా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మరోవైపు అల్లు అరవింద్ కూడా ది గర్ల్ ఫ్రెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ ని చీఫ్ గెస్ట్ పిలుద్దామని అనుకుంటున్నాం అని చెప్పడంతో ఆడిటోరియం మొత్తం కేకలు,అరుపులతో మార్మోగిపోయింది.
