Begin typing your search above and press return to search.

'సార్' రోజంతా రష్మికతోనే ఉంటారా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమా ఈవెంట్‌ లో మాట్లాడుతుంటే.. మధ్యలో స్టార్ హీరో, ఆమె భర్త విజయ్ దేవరకొండ టాపిక్ వచ్చింది.

By:  M Prashanth   |   21 Sept 2026 9:25 AM IST
సార్ రోజంతా రష్మికతోనే ఉంటారా?
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమా ఈవెంట్‌ లో మాట్లాడుతుంటే.. మధ్యలో స్టార్ హీరో, ఆమె భర్త విజయ్ దేవరకొండ టాపిక్ వచ్చింది. అంతే.. అక్కడి ఎన్విరాన్మెంట్ ఒక్కసారిగా మారిపోయింది. విజయ్‌ ను ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ కు తీసుకురావాలని ఫ్యాన్ కోరగా.. రష్మిక ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ట్రైలర్‌ కేనా? ప్రీ రిలీజ్‌ కు రావొద్దా? అంటూ ఆమె నవ్వుతూ చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రస్తుతం రష్మిక మైసా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఈవెంట్ లో రష్మిక మీడియా అండ్ ఫ్యాన్స్ తో మాట్లాడారు. అదే సమయంలో విజయ్ ప్రస్తావన రావడంతో ఆమె చాలా ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు.

ఫ్యాన్ కు రష్మిక ఇచ్చిన రిప్లై లో అసలు పంచ్ ఉంది. ట్రైలర్ లాంచ్‌ కు మాత్రమే విజయ్‌ ను పిలవాలా.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కు కూడా పిలవాలా అంటూ ఆమె చమత్కరించారు. చివర్లో రోజంతా సార్ నాతోనే ఉంటారా? అనడం నవ్వులు పూయించింది. సాధారణంగా స్టార్ హీరో, హీరోయిన్ గురించి అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆన్సర్లు వస్తుంటాయి. కానీ ఇక్కడ భర్త గురించి రష్మిక ఫన్నీగా మాట్లాడటంతో ఆ కన్వర్జేషన్ కు మరింత క్రేజ్ వచ్చింది.

విజయ్, రష్మిక జోడీకి ప్రేక్షకుల్లో మొదటి నుంచే స్పెషల్ క్రేజ్ ఉంది. గీత గోవిందంలో వీరిద్దరి జోడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో మరోసారి కలిసి యాక్ట్ చేశారు. ఆ రెండు సినిమాల సమయంలో ఏర్పడిన పరిచయం, ఫ్రెండ్ షిప్ గురించి చాలా రోజులపాటు డిబేట్ నడిచింది. ఆ తర్వాత వారిద్దరూ రియల్ లైఫ్ లో కూడా పార్టనర్స్ గా మారడంతో వారికి సంబంధించిన ప్రతి చిన్న వివియం కూడా ప్రత్యేకంగా మారుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న చిత్రం రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో రష్మిక జయమ్మ పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 16న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత రష్మిక మైసాతో నవంబర్ 27న థియేటర్స్ లోకి రానున్నారు.

ప్రస్తుతం టీజర్‌ తో ఆ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం జరుగుతున్న వేళ.. ఈవెంట్ లో విజయ్ టాపిక్ రావడం, దానికి రష్మిక ఇచ్చిన ఆన్సర్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఫ్యాన్స్ విజయ్‌ ను రష్మికతో కలిసి చూడాలని కోరుకోవడం కొత్త విషయం కాదు. కానీ.. రోజంతా సార్ నాతోనే ఉంటారా అంటూ రష్మిక ఇచ్చిన సమాధానం మాత్రం పూర్తిగా ఆమెలో కామిక్ సెన్స్ ను క్లియర్ గా చూపించింది. అందుకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.