వెజిటేరియన్ గా మారి షాకిచ్చిన స్టార్ హీరోయిన్
కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసిన రష్మిక మందన్నా, తర్వాత ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన నటిస్తూ నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్నా
By: Sravani Lakshmi Srungarapu | 20 Sept 2025 12:00 AM ISTకన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసిన రష్మిక మందన్నా, తర్వాత ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన నటిస్తూ నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్నారు. పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో పాటూ యానిమల్, ఛావా సినిమాలు రష్మికకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్, ఫాలోవర్లను పెంచడమే కాకుండా అమ్మడికి ఆ సినిమాలు విపరీతమైన స్టార్‌డమ్ ను తెచ్చిపెట్టాయి.
వెజిటేరియన్ గా మారిన రష్మిక
తక్కువ టైమ్ లోనే విపరీతమైన స్టార్‌డమ్ ను సంపాదించుకున్న రష్మిక తన లైఫ్ స్టైల్ లో వచ్చిన ఓ పెద్ద మార్పును వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను మాంసం తీసుకోవడాన్ని పూర్తిగా మానేసి పూర్తి శాకాహారిగా మారానని చెప్పిందీ కన్నడ బ్యూటీ. రష్మిక చెప్పిన ఈ వార్త ప్రేక్షకులతో పాటూ సినీ ఇండస్ట్రీలో కూడా క్యూరియాసిటీని పెంచింది.
అవన్నీ మానేశా..
కెరీర్ స్టార్టింగ్ నుంచి రష్మిక ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ ఫోకస్డ్ గానే ఉండేవారు. తన డైట్ నుంచి వర్కవుట్స్ వరకు ప్రతీదీ ఫాలో అయ్యే రష్మిక తన డైలీ రొటీన్ ను షేర్ చేసుకున్నారు. డైటీషియన్ చెప్పినట్టు తన ప్రతీ రోజూ ఒక లీటర్ వాటర్ మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ తో తన రోజు మొదలవుతుందని చెప్పిన రష్మిక, భారీగా భోజనం చేయడం, అన్నం తినడం, రాత్రిపూట ఎక్కువ తినడం మానేశానని చెప్పారు.
వాటితో పాటూ టమోటా, బంగాళదుంప, దోసకాయ లాంటి రెగ్యులర్ కూరగాయాలను అలెర్జీ వల్ల మానేసినట్టు రష్మిక తెలిపారు. కేవలం ఆహారం మాత్రమే కాకుండా యాక్టివ్ గా ఉండటానికి ప్రతీ రోజూ సాయంత్రం వర్కవుట్స్ చేస్తానని చెప్పడంతో రష్మిక తన లైఫ్ స్టైల్ విషయంలో ఎంత ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక రష్మిక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ది గర్ల్‌ఫ్రెండ్, థామా, కాక్‌టెయిల్2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవి కాకుండా పలు సినిమాల్లో కూడా రష్మిక నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
