Begin typing your search above and press return to search.

జపాన్‌లో రష్మిక మందన్నా రేర్ రికార్డు!

తాజాగా మ‌రోసారి మే లో జరగబోయే 10వ వార్షికోత్సవ వేడుకకు కూడా ఆమెను ప్రెజెంటర్‌గా ఎంపిక చేయడం విశేషం. ఇది ఆమె గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

By:  Srikanth Kontham   |   5 April 2026 6:11 PM IST
జపాన్‌లో రష్మిక మందన్నా రేర్ రికార్డు!
X

అదృష్టం అంటే రష్మిక‌. ర‌ష్మిక అంటే అదృష్టం. అన్న‌ట్లు ఆమె కెరీర్ లో ఎలా ఎదిగారు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. అదృష్టంతో పాటు ప్ర‌తిభ కూడా తోడ‌వ్వ‌డంతో భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అమ్మ‌డు వేగంగా ఎదిగింది. ఈ నేప‌థ్యంలో తాజాగా రష్మిక మందన్నా కీర్తి కిరీటంలో మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం చేరింది. జపాన్ రాజధాని టోక్యోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్ 2026 వేడుకకు అమ్మడిని ప్రెజెంటర్‌గా ఆహ్వానం అందుకున్నారు. ఈ వేదికపై వరుసగా రెండోసారి అవార్డులను అందజేయనున్న తొలి భారతీయ నటిగా రష్మిక సరికొత్త రికార్డును సృష్టించింది.

అనిమే సంస్కృతికి జపాన్ పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న అనిమే రంగంలో ఇచ్చే అవార్డులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. 2024లో జరిగిన వేడుకలో రష్మిక తొలిసారి పాల్గొని ఆశ్చర్యపరిచారు. తాజాగా మ‌రోసారి మే లో జరగబోయే 10వ వార్షికోత్సవ వేడుకకు కూడా ఆమెను ప్రెజెంటర్‌గా ఎంపిక చేయడం విశేషం. ఇది ఆమె గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. రష్మికకు వ్యక్తిగతంగా కూడా అనిమే ని ఎంతో గౌర‌విస్తారు. ఆమె చిన్నప్పటి నుండి జపనీస్ యానిమేషన్ చిత్రాలను, సిరీస్‌లను ఎంతో ఆసక్తిగా చూసేవారు.

ముఖ్యంగా నరుటో వంటి సిరీస్‌లు తనకెంతో ఇష్టమని పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా పంచు కు న్నారు. తనకు ఇష్టమైన రంగంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల రష్మిక హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుక ద్వారా ఆమె హాలీవుడ్ , జపనీస్ సినీ దిగ్గజాలతో వేదికను పంచుకోనున్నారు. ర‌ష్మిక సినిమాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం, ఇలాంటి గ్లోబల్ ఈవెంట్లలో పాల్గొంటూ రష్మిక తన పరిధిని విస్తరించుకుంటున్నారు.

దక్షిణాది నుండి బాలీవుడ్ వరకు తన నటనతో మెప్పించిన ర‌ష్మిక అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని చాటుతున్నారు. జపాన్ వంటి దేశాల్లో కూడా ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఈ ఆహ్వానంతో మరోసారి రుజువైంది. రష్మిక సినిమాల విష‌యానికి వ‌స్తే? ప్ర‌స్తుతం చేతినిండా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండతో `రణబాలి`, లేడీ ఓరియెంటెడ్ చిత్రం `మైసా` లో న‌టిస్తోంది. బాలీవుడ్ లో కాక్ టెయిల్ 2 లోనూ న‌టిస్తోంది. ఇంకా మ‌రికొన్ని ప్రాజెక్ట్ లున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ మధ్యలోనే ర‌ష్మిక జపాన్ పర్యటనకు వెళ్ల‌నుంది.