Begin typing your search above and press return to search.

గర్ల్ ఫ్రెండ్ రియాక్షన్.. రష్మిక ఎమోషనల్..!

రష్మిక మందన్న లీడ్ రోల్ లో చిలసౌ ఫేమ్ రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ధీరజ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ధీరజ్, విద్య ఈ సినిమా నిర్మించారు.

By:  Ramesh Boddu   |   12 Nov 2025 1:03 PM IST
గర్ల్ ఫ్రెండ్ రియాక్షన్.. రష్మిక ఎమోషనల్..!
X

రష్మిక మందన్న లీడ్ రోల్ లో చిలసౌ ఫేమ్ రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ధీరజ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ధీరజ్, విద్య ఈ సినిమా నిర్మించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో ఈ సినిమా వచ్చింది. రిలీజ్ ముందు వరకు నామ మాత్రపు బజ్ తోనే వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్ తర్వాత ఆడియన్స్ లో ఒక వైబ్ తీసుకొచ్చింది. ఈ సినిమా చూసిన లేడీ ఆడియన్స్ అంతా సర్ ప్రైజ్ అవుతున్నారు. కొందరైతే ఎమోషనల్ అయిపోతున్నారు. సినిమాలో కొన్ని సీన్స్ లో రష్మిక యాక్టింగ్ చూసి ఫిదా అవుతున్నారు.

సినిమా రెస్పాన్స్ పై రష్మిక సూపర్ హ్యాపీ..

ది గర్ల్ ఫ్రెండ్ ఫీవర్ ని మరింత పెంచేందుకు డైరెక్టర్ రాహుల్, రష్మిక మిగతా కొందరు థియేటర్ విజిట్ వెళ్లారు. ఈ క్రమంలో ఆడియన్స్ రష్మికని చూసి సినిమా గురించి.. ఆమె యాక్టింగ్ గురించి ఎమోషనల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్మిక కూడా సినిమా రెస్పాన్స్ పై సూపర్ హ్యాపీగా ఉండటమే కాదు ఇంతమంది తన యాక్టింగ్ గురించి పొగుడుతుంటే హ్యాపీ టియర్స్ పెట్టుకుంది.

గర్ల్ ఫ్రెండ్ సినిమాను రష్మిక చాలా ఓన్ చేసుకుని చేసింది. ఇది ఒక పర్ఫెక్ట్ ఉమెన్ సెంట్రిక్ సినిమాగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. ముఖ్యంగా ఒక మేల్ డైరెక్టర్ ఇలాంటి సినిమా ఎలా తీశాడంటూ డైరెక్టర్ రాహుల్ రవింద్రన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో దీక్షిత్ శెట్టి మేల్ లీడ్ గా నటించాడు. మొత్తానికి రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ రీచ్ చూసి మేకర్స్ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు.

ఈమధ్య రష్మిక తన సినిమాల ఫలితాలతో కాస్త అప్సెట్ లో ఉండగా లేటెస్ట్ గా ది గర్ల్ ఫ్రెండ్ రెస్పాన్స్ చూసి సూపర్ హ్యాపీగా ఉంది. క్యారెక్టరైజేషన్స్ లోని వేరియేషన్స్ ని తన ఇన్నర్ వాయిస్ ని ప్రొజెక్ట్ చేయడం.. ఎక్స్ ప్రెషన్స్ చూపించడంలో రష్మిక బెస్ట్ పర్ఫార్మెన్స్ ది గర్ల్ ఫ్రెండ్ లో ఇచ్చింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా రష్మికకు కచ్చితంగా అవార్డులు వచ్చి తీరుతాయని అంటున్నారు.

ది గర్ల్ ఫ్రెండ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో స్పెషల్ మూవీ..

రష్మిక కూడా రాహుల్ చెప్పిన క్యారెక్టరైజేషన్ ని బాగా అర్థం చేసుకుని తన అభినయంతో మెప్పించింది. కమర్షియల్ సినిమాల్లో నటిస్తే వందలు, వేల కోట్లు కలెక్షన్స్ సంపాదిస్తాయి కానీ నటిగా సంతృప్తి రావాలంటే మాత్రం మంచి జోష్ వస్తుంది. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో స్పెషల్ మూవీగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్.

సో రష్మిక చివరి రెండు సినిమాలు పెద్దగా వర్క్ అవుట్ కాకపోయినా ది గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన పుష్ తో మళ్లీ నూతన ఉత్సాహం తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ అమ్మడు విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుంది. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో పీరియాడికల్ మూవీగా వస్తుంది.