గర్ల్ ఫ్రెండ్.. రష్మిక అంత తక్కువ తీసుకుందా?
స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం నార్త్ టు సౌత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 9 Nov 2025 6:49 PM ISTస్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం నార్త్ టు సౌత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగుతోపాటు హిందీలో భారీ విజయాలు అందుకుంటున్న రష్మిక.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రీసెంట్ గా థామా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను అందుకున్నారు.
తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో థియేటర్స్ లోకి వచ్చిన అమ్మడు.. తన యాక్టింగ్ తో అందరినీ అలరిస్తున్నారు. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ లో రష్మిక తన నటనతో ఫిదా చేశారని అంతా కొనియాడుతున్నారు. అదే సమయంలో ఇప్పుడు ఆమె పారితోషికం కోసం డిస్కస్ చేసుకుంటున్నారు.
ఎందుకంటే స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలుతున్న రష్మిక.. ఇప్పుడు రెమ్యునరేషన్ ను కూడా భారీగా తీసుకుంటున్నారు. రూ.5- రూ.10 కోట్ల రేంజ్ లో అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అలా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కూాడా రష్మికకు పెద్ద ఎత్తున డబ్బులు అందుకుని ఉంటారని కొందరు నెటిజన్లు అంచనా వేశారు. కానీ అది నిజం కాదని సమాచారం.
గర్ల్ ఫ్రెండ్ మూవీ కథ నచ్చి రెమ్యునరేషన్ ఏమి వద్దని.. సినిమా చేశాక చూసుకుందామని రష్మిక షూటింగ్ కు ముందే మేకర్స్ కు చెప్పారట. ఆ విషయాన్ని మేకర్స్ ప్రమోషన్స్ టైమ్ లోనే వెల్లడించారు. కానీ పారితోషికం ఇవ్వడం తమ బాధ్యత అని తెలిపారు. ఆమెకు తాము డబుల్ రెమ్యునరేషన్ ఇస్తామని కూడా చెప్పారు.
అయితే ఇప్పుడు రష్మిక తనకు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ చాలు అని చెప్పినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సినిమా కోసం 50 రోజులకు పైగా కేటాయించినప్పటికీ అంత మొత్తం సరిపోతుందని అన్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ స్టోరీలపై ఉన్న మక్కువ కారణంగా తక్కువ పారితోషికం తీసుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినికిడి.
ఏదేమైనా రష్మిక తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారని చెప్పాలి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమె.. తెలుగు సినిమాలకు రూ.5-6 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు టాక్. బాలీవుడ్ చిత్రాలకు మాత్రం రూ.8-10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను.. తెలుగు మూవీస్ కు తీసుకునే మొత్తంలో సగం మాత్రమే అందుకున్నట్లు ఉన్నారు.
