ఇలాంటి లుక్ తో రష్మికని చూస్తారా..?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్.
By: Ramesh Boddu | 5 Nov 2025 3:16 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ధీరజ్, విద్య నిర్మంచారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ రాహుల్ రవింద్రన్ మాట్లాడుతూ యానిమల్ తర్వాత రష్మిక ఈ సినిమా సెట్ కి వచ్చింది. ఆ సినిమా ఏమో 500, 700 కోట్లు అంటూ వసూళ్లు చేస్తుంది. కానీ ఇందులోనేమో రష్మిక రెగ్యులర్ అమ్మాయిలా డ్రస్ లు వేసుకుంటుంది.
మనకు సినిమా తీయడం వచ్చా రాదా..
ఈ రష్మికని చూస్తారా అన్న డౌట్ వచ్చింది. ఒక టైం లో మనకు సినిమా తీయడం వచ్చా రాదా అని కూడా డౌట్ వచ్చిందని.. ఆ టైం లో కెమెరా మెన్ కేవి తనకు సపోర్ట్ గా నిలబడి ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం అయ్యిందని అన్నాడు రాహుల్ రవింద్రన్. సినిమా మొదలైన 10 నిమిషాల్లోనే రష్మికని మర్చిపోతారని చెబుతున్నాడు డైరెక్టర్ రాహుల్.
రష్మికకు కాస్టూంస్ డిజైన్ చేసిన డిజైనర్ తో పాటు ప్రొడక్షన్ డిజైనర్ కి కూడా స్పెషల్ థాంక్స్ చెప్పారు రాహుల్. సినిమా లో రష్మిక ఉన్న ప్రతి సీన్ చాలా బాగా కనిపించేలా చేశారని అన్నారు రాహుల్. ఈ సినిమా కోసం అంతా తమ బెస్ట్ ఎఫర్ట్ పెట్టారని తన టీం కూడా తనకు బాగా సపోర్ట్ చేసిందని అన్నారు రాహుల్. నిర్మాతలతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ చాలా బాగుందని అన్నారు.
ఇతను కొన్నాళ్లు ఇక్కడ ఉంటాడంటూ..
ఇక ఇదే ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. రష్మిక అద్బుతంగా చేసింది. ఆమె గురించి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. కానీ రక్షిత్ మాత్రం చాలా బాగా చేశాడు. దసరా చూసి ఇతనెవరో బాగా చేశాడు అనుకున్నా ఈ సినిమా చూసి వెంటనే మరో సినిమాకు అడ్వాన్స్ ఇచ్చాం. ఇతను కొన్నాళ్లు ఇక్కడ ఉంటాడంటూ దీక్షిత్ గురించి చెప్పారు అల్లు అరవింద్.
ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా తప్పకుండా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాతో రష్మికకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ సైతం వస్తుందని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో చిత్ర యూనిట్ చెప్పారు. మరి నిజంగానే రష్మిక ఆ రేంజ్ పర్ఫార్మ్ చేసిందా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.
