Begin typing your search above and press return to search.

రష్మిక మహానటి అనిపించుకుంటుందా..?

ఈ సినిమాతో రష్మికకు నేషనల్ అవార్డ్ వస్తుందని భావిస్తున్నారు. నిజంగానే అంత సీన్ ఉందా లేదా ఇదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగమేనా అన్నది కూడా డౌట్ కొడుతుంది.

By:  Ramesh Boddu   |   3 Nov 2025 10:11 AM IST
రష్మిక మహానటి అనిపించుకుంటుందా..?
X

నేషనల్ క్రష్ రష్మిక లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిలసౌ ఫేం రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఫిమేల్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మికతో కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమా నిర్మించారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా ట్రైలర్ చూస్తే ఇది రెగ్యులర్ సినిమా కాదని హింట్ ఇచ్చేశారు.

రష్మిక నెక్స్ట్ లెవెల్ లో క్యారెక్టర్..

అందుకే సినిమా గురించి రిలీజ్ ముందు ప్రత్యేకమైన చర్చకు తావిస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. సినిమాలో ఆమె రోల్ కచ్చితంగా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అవుతుందని అంటున్నారు. సినిమాను మేకర్స్ ఇప్పటికే కొందరికి చూపించగా అదుర్స్ అని అన్నారట. సెన్సార్ నుంచి కూడా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

కొత్త కథలతో తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ తీసుకొస్తున్నారు మేకర్స్. ఐతే రాహుల్ రవింద్రన్ ఆల్రెడీ చిలసౌ తో తన సత్తా చాటాడు. ఆ సినిమాలో కూడా రుహాని శర్మ రోల్ చాలా బలంగా అనిపిస్తుంది. ఇప్పుడు అదే పంథాలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా గురించి సినిమాకు సంబంధం లేని వారు ఆఫ్టర్ వాచింగ్ నెక్స్ట్ లెవెల్ అనేస్తున్నారట.

రష్మిక మహానటి అనిపించుకుంటుందా..

ఈ సినిమాతో రష్మికకు నేషనల్ అవార్డ్ వస్తుందని భావిస్తున్నారు. నిజంగానే అంత సీన్ ఉందా లేదా ఇదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగమేనా అన్నది కూడా డౌట్ కొడుతుంది. మహానటి సినిమాతో తెలుగు పరిశ్రమ నుంచి కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డ్ వచ్చింది. మళ్లీ రష్మిక కూడా అలాంటి మహానటి అనిపించుకుంటుందా లేదా అన్నది ఈ నవంబర్ 7న తెలుస్తుంది.

రష్మిక కూడా ఓ పక్క పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మరోపక్క కంటెంట్ ఉన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో తన మార్క్ చాటాలని చూస్తుంది అమ్మడు. మరి గర్ల్ ఫ్రెండ్ గా నేషనల్ క్రష్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అన్నది చూడాలి.

రష్మికతో పాటు దీక్షిత్ శెట్టి కూడా ఈ సినిమాలో ది బెస్ట్ ఇచ్చాడని టాక్. ఆల్రెడీ అతను నానితో దసరా సినిమాలో నటించి మెప్పించాడు. ఐతే ఈసారి రష్మిక పక్కన లీడ్ రోల్ లో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. రష్మికకు బాలీవుడ్ లో మొన్నటిదాకా వరుస హిట్లు పడగా థామా ఫ్లాప్ తో ఆమె కాస్త డిజప్పాయింట్ లో ఉంది. ది గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక హిట్ కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.