'గర్ల్ ఫ్రెండ్' బాక్సాఫీస్.. యూఎస్ లెక్క ఎంత?
రష్మిక మందన్న 'ది గర్ల్ ఫ్రెండ్'గా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చూపిస్తోంది. నవంబర్ 7న రిలీజైన ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా, పాజిటివ్ మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది.
By: M Prashanth | 12 Nov 2025 11:28 AM ISTరష్మిక మందన్న 'ది గర్ల్ ఫ్రెండ్'గా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చూపిస్తోంది. నవంబర్ 7న రిలీజైన ఈ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా, పాజిటివ్ మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా, వీకెండ్ తర్వాత అసలు సిసలు మండే టెస్ట్‌లో సాలిడ్‌గా పాస్ అవ్వడమే కాదు, ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఒక రేర్ ఫీట్‌ను అందుకుంది. ఈ సినిమా స్టడీగా రన్ అవుతూ, నార్త్ అమెరికాలో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో అడుగుపెట్టింది.
లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, 'ది గర్ల్ ఫ్రెండ్' నార్త్ అమెరికాలో ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్ ($500K+) గ్రాస్ మార్క్‌ను దాటేసింది. ఇది రష్మిక కెరీర్‌కు, అలాగే ఒక ఫీమేల్ సెంట్రిక్ రొమాంటిక్ డ్రామాకు చాలా పెద్ద మైల్‌స్టోన్. ఎలాంటి భారీ యాక్షన్ హంగామా లేదు, అలాగే స్టార్ హీరో పవర్ లేకుండా.. కేవలం కంటెంట్, రష్మిక పెర్ఫార్మెన్స్‌ను నమ్ముకుని వచ్చిన ఈ సినిమాకు యూఎస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.
ఈ సక్సెస్‌కు కారణం ప్యూర్ ఆడియన్స్ నుంచి వస్తున్న పాజిటివ్ టాక్. సినిమా చూసిన ప్రేక్షకులు, ముఖ్యంగా మల్టీప్లెక్స్ ఆడియన్స్.. రాహుల్ రవీంద్రన్ టేకింగ్‌కు, క్లీన్ ఎమోషన్స్‌కు గట్టిగా కనెక్ట్ అయ్యారు. ఓ మంచి సినిమా అంటూ మేకర్స్ కూడా కాన్ఫిడెంట్‌గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ పాజిటివ్ వైబ్, యూఎస్‌లోని ఆడియన్స్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది, అందుకే వీక్ డేస్‌లో కూడా కలెక్షన్లు స్ట్రాంగ్‌గా నిలబడ్డాయి.
ఈ సక్సెస్ సందర్భంగా, మేకర్స్ సోషల్ మీడియాలో ఒక ట్రెండీ పోస్టర్‌ను వదిలారు. క్రష్మిక కాదు, బాక్సాఫీస్‌ను క్రష్ చేస్తోంది.. అంటూ పోస్ట్ పెట్టారు. అంటే, రష్మిక కేవలం 'నేషనల్ క్రష్' ట్యాగ్‌తో గ్లామర్ డాల్‌గా మాత్రమే కాదు, తన భుజాలపై సినిమాను మోసి, బాక్సాఫీస్ నంబర్లను కూడా 'క్రష్' చేయగల స్టార్ పవర్‌ను ప్రూవ్ చేసుకుందని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ సాలిడ్ హిట్‌ను, ముఖ్యంగా ఓవర్సీస్‌లో 500K మైల్‌స్టోన్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి 'ది గర్ల్ ఫ్రెండ్' టీమ్ రెడీ అయింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని, సక్సెస్ సెలబ్రేషన్స్‌ను ఈరోజు (నవంబర్ 12) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.
ఓవరాల్‌గా, 'ది గర్ల్ ఫ్రెండ్'.. రష్మికకు సోలోగా, కంటెంట్ బేస్డ్ మూవీతో ఒక మెమొరబుల్ హిట్‌ను ఇచ్చింది. ఓవర్సీస్ మార్కెట్‌లో హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేయడం అనేది టీమ్ నమ్మకాన్ని, సినిమా కంటెంట్‌ను ప్రూవ్ చేసింది. రాహుల్ రవీంద్రన్‌కు కూడా 'చి ల సౌ' తర్వాత మళ్లీ ఒక సాలిడ్ కంబ్యాక్ దొరికినట్టే.
