వైద్యుడు మందలించినా.. గాయంతోనే షూటింగ్!
ఈ ఏడాది ప్రారంభంలో రష్మిక మందన్న కాలికి కట్టు కట్టించుకుని కుంటుతూ సినిమాల ప్రమోషన్స్ కి హాజరైన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 25 Oct 2025 7:00 AM ISTఈ ఏడాది ప్రారంభంలో రష్మిక మందన్న కాలికి కట్టు కట్టించుకుని కుంటుతూ సినిమాల ప్రమోషన్స్ కి హాజరైన సంగతి తెలిసిందే. జిమ్ లో కాలికి గాయం అవ్వడంతో రష్మిక నడవలేని పరిస్థితి తలెత్తింది. అయినా తన ఇబ్బందిని పక్కన పెట్టి సినిమా ప్రయోజనం కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది రష్మిక. తన వల్ల సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని భావించి రష్మిక చాలా హార్డ్ వర్క్ చేసింది.
ఓవైపు కుంటుతూనే థామలో సాంగ్ షూట్ కూడా పూర్తి చేసింది రష్మిక. 30 రోజుల పాటు ప్రచార కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడిపేసింది. ఆ సమయంలో కాలి నొప్పి విపరీతంగా భాధించింది. అయినా ఆ బాధను దిగమింగుకుని మరీ చావా ప్రమోషన్స లో పాల్గొన్నానని రష్మిక వెల్లడించింది. అయితే ఎలాంటి శ్రమను అయినా థియేటర్లలో జనాదరణ చూశాక మర్చిపోతానని కూడా రష్మిక పేర్కొంది. అయితే రెస్ట్ లెస్ గా గాయంతో తిరిగేస్తున్నందున డాక్టర్ గారికి అది తెలిసి మందలించారని కూడా వెల్లడించింది.
ప్రస్తుతం థామ నుంచి `తేరే మురి నా హుయే!` అంటూ సాగే వీడియో పాటను రిలీజ్ చేయగా, రష్మిక అద్బుత నృత్యానికి ప్రశంసలు కురుస్తున్నాయి. నెటిజనుల ప్రశంసలకు రష్మిక కూడా ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఆయుష్మాన్ ఖురానా- రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన థామ ఇటీవల విడుదలై 75 కోట్లు వసూలు చేసింది. ఈ ఫ్రాంఛైజీలో థామ 2 ఉంటుందని మేకర్స్ వెల్లడించారు.
పుష్ప ఫ్రాంఛైజీ చిత్రాలతో అలరించిన రష్మిక మందన్న యానిమల్ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. తదుపరి థామ లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించింది. మునుముందు బాలీవుడ్ లో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో రష్మిక మందన్న మెరవనుంది. కాక్ టైల్ 2లోను రష్మిక నటిస్తోంది. తదుపరి యానిమల్ పార్క్ చిత్రంలోను నటించాల్సి ఉంటుంది.
