రష్మికకి 5వ రూ.100 కోట్లు సాధ్యమేనా...?
సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రష్మిక మందన్న ఉందన్న కారణంతో ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు.
By: Ramesh Palla | 31 Oct 2025 1:00 AM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల థామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రష్మిక మందన్న ఉందన్న కారణంతో ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సినిమాకు రష్మిక హీరోయిన్ కావడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. సినిమాకు వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా మొదటి రెండు మూడు రోజులు సాలిడ్ కలెక్షన్స్‌ను థామా సినిమా రాబట్టింది. హర్రర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రమే కాకుండా, రష్మిక మందన్నపై అభిమానంతో థామా సినిమాను చూసిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు థామా సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో రష్మిక అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. థామా సినిమా విజయం క్రెడిట్ పూర్తిగా రష్మిక మందన్న ఖాతాలో ఆమె ఫ్యాన్స్ వేస్తున్నారు.
విక్కీ కౌశల్ హీరోగా థామా...
థామా సినిమాలో హీరోగా నటించిన విక్కీ కౌశల్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఓపెనింగ్స్‌ను చవిచూశాడు. అందుకు కారణం ఖచ్చితంగా రష్మిక మందన్న అంటూ చాలా మంది సినీ విశ్లేషకులు, బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థామా సినిమా ఇప్పటి వరకు రూ.130 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ద్వారా రష్మిక ఈ ఏడాది మరో వంద కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకుంది. గత ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్‌గా రికార్డ్ సొంతం చేసుకోగా, ఈసారి ఏకంగా నాలుగు సినిమాలతో ప్రతి సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. హీరోయిన్‌గా రష్మిక మందన్న త్వరలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఫలితంపై అందరి దృష్టి ఉంది.
రష్మిక మందన్న హీరోయిన్‌గా థామా మూవీ...
రష్మిక మందన్న హీరోయిన్‌గా రూపొందిన ఈ లేడీ ఓరియంటెడ్ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా టీజర్‌కి విజయ్ దేవరకొండ ఇచ్చిన వాయిస్ ఓవర్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఆకట్టుకునే అందం తో పాటు, నటనతోనూ మెప్పిస్తాను అన్నట్లుగా రష్మిక మందన్న మరోసారి ఈ సినిమాతో ఆకట్టుకుంటుంది అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. తెలుగులో మాత్రమే కాకుండా ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. కనుక వంద కోట్ల మార్కెట్ పెద్ద కష్టం ఏమీ కాదు అని విశ్లేషకులు అంటున్నారు. రష్మిక మందన్న గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో వంద కోట్లు...
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి. నవంబర్ 7న విడుదల కాబోతున్న ఈ సినిమా కూడా రూ.100 కోట్లు, అంతకు మించి వసూళ్లు చేస్తే రష్మిక ఖాతాలో ఒక్క క్యాలెండర్ ఇయర్ లో ఏకంగా అయిదు వంద కోట్ల సినిమాలు పడ్డట్లు అవుతాయి. ఇప్పటికే ఛావా, సికిందర్, కుబేరా, థామా సినిమాలు వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు నమోదు చేశాయి. సికిందర్, థామా సినిమాలు టాక్ పరంగా యావరేజ్ అనిపించుకున్నా, సినిమాకు ఉన్న స్టార్ కాస్ట్ నేపథ్యంలో వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు సాధించాయి. అందుకే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సైతం వంద కోట్ల వసూళ్లు సాధిస్తే ఒకే ఏడాది అయిదు సినిమాలతో వంద కోట్ల వసూళ్లు సాధించిన హీరోయిన్‌గా రకుల్‌కు అరుదైన రికార్డ్ ఉంటుంది అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ది గర్ల్ ఫ్రెండ్ ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.
