Begin typing your search above and press return to search.

ర‌చ‌యిత‌ల‌కు ర‌ష్మిక స‌రెండ‌ర్!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా కెరీర్ పాన్ ఇండియాలో దేదీప్య మానంగా సాగిపోతున్న‌సంగ‌తి తెలిసిందే. తెలుగు, హిందీ సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

By:  Srikanth Kontham   |   28 Dec 2025 12:00 AM IST
ర‌చ‌యిత‌ల‌కు ర‌ష్మిక స‌రెండ‌ర్!
X

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా కెరీర్ పాన్ ఇండియాలో దేదీప్య మానంగా సాగిపోతున్న‌సంగ‌తి తెలిసిందే. తెలుగు, హిందీ సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఈ మ‌ధ్య‌నే లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు కూడా ప్రారంభించింది. ఇప్ప‌టికే `ది గ‌ర్ల్ ప్రెండ్` తో ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. త్వ‌ర‌లో `మైసా`తో మెస్మ‌రైజ్ చేయ‌డానికి రెడీ అవుతుంది. ఈ సినిమా కూడా స‌క్సెస్ అయితే ర‌ష్మిక ఇమేజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక కొత్త ప్రాజెక్ట్ ల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. క‌థా బ‌లంతో పాటు, పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌త ఉంటేనే క‌మిట్ అవుతుంది.

పాన్ ఇండియా ఇమేజ్ పై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌కూడ‌దు? అన్న జాగ్ర‌త్త‌తో తెలివైన నిర్ణ‌యాలు తీసుకుంటుంది. ఈ విష‌యంలో త‌న‌కంటే ఎక్కువ‌గా ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌ల్నే న‌మ్ముతున్న‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా ర‌ష్మిక ద‌ర్శ‌కుల్ని ఎంత‌గా న‌మ్ముతుంది? అన్న‌ది రివీల్ చేసింది. తానొక న‌టినని, ఎంట‌ర్ టైన‌ర్ అనే విష‌యం నిరంత‌రం మైండ్ లో పెట్టుకునే ప‌ని చేస్తానంది. ఒకే ఇమేజ్ కు ప‌రిమితం కాకుండా సినిమాలు చేయాల‌నుకుంటానంది. త‌న‌లోని విభిన్న వ్య‌క్తిత్వాలు, కోణాల‌ను అన్వేషించాల‌నుకుంటానంది. పాత్ర‌ల ప‌రంగా త‌న‌ని కేవ‌లం మంచి అమ్మాయిగా, అమాయ‌క‌పు అమ్మాయిగా, స‌ర‌దా, చెడ్డ మ‌హిళ‌గా చూడ‌కూడ‌ద‌నే కోరుకుంటానంది.

ప్రేక్ష‌కులు గుర్తించ‌డం కోసం ఎలాంటి పాత్ర‌ల‌కైనా తానెప్పుడు సిద్దంగా ఉంటానంది. త‌న‌ని న‌మ్మి ద‌ర్శ‌క‌, ర‌చ‌యి త‌లు రాసే పాత్ర‌ల విష‌యంలో త‌న‌క‌న్నా ఎక్కువ‌గా వాళ్ల‌నే న‌మ్ముతానంది. వాళ్ల ఆలోచ‌న‌కు త‌గ్గ‌ట్టు న‌టించా ల‌ని..అందు కోసం ఎంత మాత్రం వెనుక‌డుగు వేయ‌నంది. త‌న‌కు న‌చ్చితే, న‌మ్మ‌కంగా అనిపిస్తే ద‌ర్శ‌క‌, ర‌చ యిత‌ల‌కు పూర్తిగా స‌రెండ‌ర్ అయిపోతానంది. అలాగే తాను కేవ‌లం ఒకే భాష‌కు ఎన్న‌డు ప‌రిమితం కాద‌ని క్లారిటీ ఇచ్చింది. క‌థ‌లు న‌చ్చితే భాష‌తో ప‌ని లేకుండా ఏ భాష‌లో న‌టించ‌డానికైనా సిద్దంగా ఉంటానంది.

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళం ఏ ప‌రిశ్ర‌మ‌ను తేలిక‌గా తీసుకోనంది. ఏ భాష‌లో సినిమా చేస్తున్నా ఆ భాష‌కు అంకిత‌మై ప‌ని చేస్తానంది. ఇంత వ‌ర‌కూ అయిష్టంగా ఏ సినిమాకు ప‌ని చేయ‌లేదంది. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గొప్ప ప్ర‌యాణం సాధ్య‌మైందంటే? కార‌ణం అన్ని భాష‌లు త‌న‌ని ఆద‌రించ‌డంతోనేని కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో `కాక్ టెయిల్ 2` లో న‌టిస్తోంది. తెలుగులో `మైసా` అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకు ఊహించ‌ని హైప్ తీసుకొచ్చాయి.