Begin typing your search above and press return to search.

నేష‌న‌ల్ క్ర‌ష్‌ త‌ప్ప ఇంకెవ్వ‌రూ పోటీలో లేరా!

సౌత్ లో ఎన్ని సినిమాలు చేసినా? అంతిమంగా బాలీవుడ్ లో స్థిర‌ప‌డాలి అన్న‌ది ప్ర‌తీ హీరోయిన్ క‌ల‌. ఈనేప‌థ్యంలో న‌టీమ‌ణులంతా బాలీవుడ్ అంటే ఆస‌క్తి చూపిస్తుంటారు.

By:  Srikanth Kontham   |   31 Aug 2025 5:00 AM IST
నేష‌న‌ల్ క్ర‌ష్‌ త‌ప్ప ఇంకెవ్వ‌రూ పోటీలో లేరా!
X

సౌత్ లో ఎన్ని సినిమాలు చేసినా? అంతిమంగా బాలీవుడ్ లో స్థిర‌ప‌డాలి అన్న‌ది ప్ర‌తీ హీరోయిన్ క‌ల‌. ఈనేప‌థ్యంలో న‌టీమ‌ణులంతా బాలీవుడ్ అంటే ఆస‌క్తి చూపిస్తుంటారు. సౌత్ భామ‌లు సైతం బాలీవుడ్ అవకాశాల కోస‌మే ఎదురు చూస్తారు. వ‌చ్చాయంటే సౌత్ లో ఎంత బిజీగా ఉన్నా వాటిని వ‌దిలేసి మ‌రీ వెళ్లిపోతుంటారు. అక్క‌డ వ‌చ్చే ఆదాయం మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల‌కంటే అధికంగా ఉంటుంది.సెల‌బ్రిటీ లైఫ్ మ‌రింత రిచ్ గా ఉంటుంది. బాలీవుడ్ అంటే పెద్ద ఇండ‌స్ట్రీ కూడా. త‌క్కువ స‌మయంలోనే ఎక్కువ సంపాదించే అవ‌కాశం బాలీవుడ్ లో ఉంటుంది.

అవ‌కాశాలు క‌ష్ట‌మేనా:

అందుకే ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లో ఎన్ని సినిమాలు చేసినా చాలా మంది హిందీకి వెళ్ల‌లేక‌పోయామ‌నే నిరుత్సాహ‌న్ని వ్య‌క్తం చేస్తుంటారు. స‌మంత‌, కీర్తి సురేష్‌, ర‌ష్మికా మంద‌న్నా ఇప్ప‌టికే బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. శ్రీలీల కూడా హిందీకి ఎంట్రీ ఇచ్చింది. ఇంకా మ‌రికొంత మంది భామ‌లు ముంబై కి చేరుకున్నారు. కానీ వీళ్ల‌లో ర‌ష్మిక మ‌ద‌న్నా త‌ప్ప ఇంకెవ్వ‌రూ బాలీవుడ్ భామ‌ల‌తో పోటీ ప‌డ‌లేక‌పోతున్నారు? అన్న‌ది వెలుగులోకి వ‌చ్చింది. అవ‌కాశాల కంటే ముందే మీడియా అటెన్ష‌న్ డ్రా చేయ‌డంలోనూ ర‌ష్మిక మిన‌హా ఎవ‌రూ కాంపిటీష‌న్ లో క‌నిపించ‌లేద‌న్న‌ది తాజా స‌మాచారం.

ఎలివేష‌న్ ఏదీ వ‌ర్కౌట్ అవ్వ‌లేదు:

ఉత్త‌రాది భామ‌ల‌తో పోలిస్తే ద‌క్షిణాది భామ‌లు గ్లామ‌ర్ ఎలివేష‌న్ ప‌రంగా ఎంత మాత్రం పోటీ ఇవ్వ‌లేక పోతున్నారు. అందులో స‌క్సెస్ అయిది ర‌ష్మిక మాత్ర‌మేన‌ని మిగ‌తా వారంతా అక్క‌డ క‌ల్చ‌ర్ కు అల వాటు ప‌డ‌లేక‌పోతున్నారు. స‌మంత రెండుళ్ల‌గా బాలీవుడ్ లోనే ఎక్కువ‌గా తిరుగుతోంది. సినిమాలు చేయ‌క‌పోయినా? అమ్మ‌డి ఫోక‌స్ అంతా అక్క‌డే ఉంది. వీలైనంత వ‌ర‌కూ ఎక్స్ పోజ్ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తుంది. కానీ సామ్ ఎలివేష‌న్ ఏది? వ్య‌క్తిగ‌త హైప్ తీసుకు రావ‌డం లేదు.

ర‌ష్మిక మాత్ర‌మేనా:

కీర్తి సురేష్ కూడా నిబంధ‌న‌లు స‌డ‌లించింద‌నే ప్ర‌చారం త‌ప్ప అక్క‌డ భామ‌ల‌కు ధీటుగా ముందుకెళ్ల లేక‌పోతుంది. ముంబై బ్యూటీ పూజా హెగ్డే పెట్టాల్సిన ఎఫెర్ట్ అంతా ఎప్పుడో పెట్టేసింది. కానీ ఆ బ్యూటీ కూడా కాంపిటీష‌న్ లో లేదు. తెలుగు అమ్మాయి శ్రీలీల కూడా అక్క‌డ క‌ల్చ‌ర్ కు అల‌వాటు ప‌డ‌టం అంత సుల‌భం కాదు. వీళ్లంద‌రిలో ఉన్నంత‌లో ర‌ష్మిక బెట‌ర్ గా క‌నిపిస్తుంది. బాలీవుడ్ న‌వ‌త‌రం భామ‌ల‌కు మంచి పోటీగా నిలుస్తుంది. మీడియా అటెన్ష‌న్ డ్రా చేయ‌గ‌ల్గుతుంది. కొత్త అవ‌కాశాలు అందుకో గ‌ల్గు తుంది. ఇదంతా ఎలా సాధ్య‌మైందంటే? పోటీని త‌ట్టుకుని ముందుకెళ్లింది కాబ‌ట్టే అన్న‌ది గ్ర‌హించాలి.