నేషనల్ క్రష్ ఖాతాలో ఆ ముగ్గురు!
టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా .. నేషనల్ క్రష్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ రష్మిక మందన్న
By: Srikanth Kontham | 22 Oct 2026 11:00 PM ISTటాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా .. నేషనల్ క్రష్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ రష్మిక మందన్న. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు జెండా పాతేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లోని మహేష్ , అల్లు అర్జున్, నితిన్, విజయ్ దేవరకొండ వంటి అగ్ర కథానాయకులతో జతకట్టి బ్లాక్‌బస్టర్ విజయాలను ఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పటికీ ఆమె కెరీర్లో ఓ పెద్ద లోటు ఉందనే చర్చ ఇండస్ట్రీ లో జోరుగా సాగుతోంది.
టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్థాయిలో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న ముగ్గురు దిగ్గజ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రష్మిక ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం గమనార్హం. ఒక వైపు స్టార్ స్టేటస్.. మరోవైపు వరుస పాన్ ఇండియా ఆఫర్లు తలుపు తడుతున్నా? ఈ ముగ్గురు స్టార్స్ సరసన నటించే అవకాశం రష్మికకు ఇంకా దక్కలేదు. దీంతో ఈ బిగ్ కాంబినేషన్లు ఎప్పుడు సెట్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు రాబోయే భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాల కాస్టింగ్ వివరాల్లో ఎక్కడా రష్మిక పేరు వినిపించడం లేదు. సాధారణంగా ఒక స్టార్ హీరోయిన్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద హీరోల ప్రాజెక్టుల్లో ఆమె పేరు ప్రచారంలోకైనా వస్తుంటుంది. కానీ ఈ ముగ్గురి విషయానికి వచ్చేసరికి రష్మిక పేరు రూమర్లలో కూడా రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దీనికి ప్రధాన కారణం ఆ హీరోల సినిమా కథలు, అందులోని కథానాయికల పాత్రల స్వభావమే అయి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాజెక్ట్ డిమాండ్ బట్టి దర్శకులు ఇతర భాషల కథానాయికలను లేదా కొత్త ముఖాలను ఎంచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. అయినా? రష్మికకున్న క్రేజ్, పాన్ ఇండియా అపీల్ దృష్ట్యా మున్ముందు రాబోయే ప్రాజెక్టుల్లో ఈ కాంబినేషన్లు కుదిరే అవకాశం లేకపోలేదు.
ప్రస్తుతం రష్మిక చేతిలో కొన్ని క్రేజీ పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. వీటి ఫలితాలు ఆమె కెరీర్‌ను మరిన్ని ఎత్తులకు తీసుకెళ్లడం ఖాయం. భవిష్యత్తులో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఎవరితో ఒక్క సినిమా సెట్ అయినా? అది రష్మిక రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.
