Begin typing your search above and press return to search.

హీరోలే కాదు హీరోయిన్స్ కూడా.. ఈ ట్రెండ్ ఏదో బాగుందే!

తాజాగా రష్మిక మందన్నా, శ్రీలీల ఇద్దరూ హోటల్ పార్క్ హయత్ లో తమ నెక్స్ట్ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూ కోసం వచ్చారు.

By:  Madhu Reddy   |   27 Oct 2025 8:25 PM IST
హీరోలే కాదు హీరోయిన్స్ కూడా.. ఈ ట్రెండ్ ఏదో బాగుందే!
X

కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి. కొన్ని జంటలు కూడా అనుకోకుండానే కలుస్తారు. అలా తాజాగా అనుకోకుండా కలిశారు శ్రీలీల, రష్మిక మందన్నా..వీరిద్దరూ తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుకోకుండా ఒకే దగ్గర కలిశారు. అయితే అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా వచ్చిన పుష్ప-2 మూవీ ప్రమోషన్స్ లో రష్మిక , శ్రీలీల కలిసి పాల్గొన్నారు. ఎందుకంటే ఈ సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అలా పుష్ప-2 కోసం రష్మిక, శ్రీలీల ఇద్దరు కలిసి ప్రమోషన్ చేశారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించకపోయినప్పటికీ మళ్లీ ఒకే దగ్గర కలుసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటో ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారడంతో ఈ ఫోటో చూసి అభిమానులు దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.

తాజాగా రష్మిక మందన్నా, శ్రీలీల ఇద్దరూ హోటల్ పార్క్ హయత్ లో తమ నెక్స్ట్ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూ కోసం వచ్చారు. అలా మాస్ జాతర మూవీ కోసం శ్రీలీల.. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కోసం రష్మిక మందన్నా ఇద్దరు ఒకే దగ్గర కలుసుకున్నారు.ఈ ఫోటోలో రష్మిక మందన్నా క్రీం కలర్ డ్రెస్ వేసుకోగా.. శ్రీలీల పింక్ కలర్ కుర్తాలో కనిపించింది. వీరిద్దరూ చాలా ఎక్జైటింగ్ గా ఈ ఫోటోలో కనిపించారు. ఇద్దరు హీరోయిన్లు ఒకే దగ్గర కనిపించడంతో ఇద్దరు హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలను అభిమానులు షేర్ చేయకుండా ఉండలేకపోయారు. అలా వీరిద్దరూ సినిమా ప్రమోషన్ కంటే అక్కచెల్లెళ్ల లా ఉన్నట్టు చాలామంది ఈ ఫోటో చూసి కామెంట్లు పెడుతున్నారు.. రష్మిక తను నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీని తెగ ప్రమోట్ చేస్తోంది. రీసెంట్ గానే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

అలాగే శ్రీలీల మాస్ జాతర మూవీతో ఫుల్ స్వింగ్ లో ఉంది. అలా వీరిద్దరికి సంబంధించిన ప్రమోషనల్ క్లిప్పులు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నవ్వుతూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ కనిపించారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మళ్లీ వీరిద్దరి కాంబోలో ఒక ఫుల్ లెంగ్త్ మూవీ కావాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మాస్ జాతర మూవీ విషయానికి వస్తే.. భాను భోగవరపు డైరెక్షన్లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. రవితేజ, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించారు.ఈ మూవీ మొదట అక్టోబర్ 31న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత మళ్లీ నవంబర్ 1కి పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది.. అయితే చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ డేట్ నవంబర్ 1 అని అధికారికంగా ప్రకటించలేదు. బహుశా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటిస్తారు కావచ్చు. ఇక ధమాకా మూవీ కాంబో మళ్లీ రిపీట్ అవ్వడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

రష్మిక నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ విషయానికి వస్తే.. రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి కాంబోలో వస్తున్న ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీ నవంబర్ 7న విడుదల కాబోతోంది.

ఇకపోతే ఈ ప్రమోషనల్ వీడియో చూసి అభిమానులు ఇది టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్.. అటు హీరోలే కాదు ఇటు హీరోయిన్లు కూడా రెండు చిత్రాలకు సంబంధించి ఒకే చోట ప్రమోషన్ చేసుకుంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదివరకే మాస్ జాతరలో భాగంగా రవితేజ 'తెలుసు కదా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధూ జొన్నలగడ్డ కలిసి తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడమే కాకుండా పలు విషయాలను కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా ప్రమోషన్స్ తో హైప్ పెంచేశారు అని చెప్పవచ్చు. మరి ఈ ట్రెండ్ ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.