Begin typing your search above and press return to search.

సరికొత్త బ్రాండ్ ప్రకటనలో ఆకట్టుకుంటున్న నేషనల్ క్రష్!

వాణిజ్య ప్రకటనల శైలి మారిపోతుంది. ఒక సెలబ్రిటీ వచ్చి ఉత్పత్తిని ప్రమోట్ చేయడం కంటే విభిన్న రంగాలకు చెందిన కళాకారులను ఒకే వేదికపైకి తెచ్చి సరికొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టు కుంటున్నారు.

By:  Srikanth Kontham   |   18 Jun 2026 3:15 PM IST
సరికొత్త బ్రాండ్ ప్రకటనలో ఆకట్టుకుంటున్న నేషనల్ క్రష్!
X

వాణిజ్య ప్రకటనల శైలి మారిపోతుంది. ఒక సెలబ్రిటీ వచ్చి ఉత్పత్తిని ప్రమోట్ చేయడం కంటే విభిన్న రంగాలకు చెందిన కళాకారులను ఒకే వేదికపైకి తెచ్చి సరికొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టు కుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ రూపొందించిన సరికొత్త ప్రకటన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రకటనలో పాన్-ఇండియా స్టార్ రష్మిక మందన్నతో కలిసి ఒక సితార్ వాయిద్యకారుడు నటించడం సరికొత్త హంగులను తెచ్చిపెట్టింది. షూటింగ్ సమయంలో రష్మికతో కలిసి పనిచేసిన అనుభవాన్ని సదరు సితార్ విద్వాంసుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.





ఈ ప్రకటనలో రష్మిక ఎనర్జీ.. ఆమె హావభావాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. సాంప్రదాయ వాయిద్యమైన సితార్‌ను, ఆధునిక యూత్ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌తో ముడిపెడుతూ తీసిన కమర్షియల్ సరికొత్త ట్రెండ్‌కు తెరలేపిందని చెప్పొచ్చు. షూటింగ్ సెట్స్‌లో రష్మిక చూపించిన చొరవ, ఉత్సాహం అందరినీ ఆకట్టుకున్నాయి.

రష్మిక మందన్నా పని పట్ల ఎంతటి అంకితభావంతో ఉంటుందో ఈ షూటింగ్ ద్వారా అర్ద‌మైంద‌ని సితారిస్ట్ పేర్కొన్నారు. ఆమె నటనలో ఎంతో ప్రతిభావంతురాలని, ప్రతి షాట్‌ను ఎంతో శ్రద్ధతో పూర్తి చేస్తుందని ప్రశంసల వర్షం కురిపించారు.

స్టార్డమ్ ఉన్నప్పటికీ సహ కళాకారులను గౌరవించే ఆమె గుణం, సెట్స్‌లో ప్రవర్తించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ఆమెతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవమని కొనియాడారు.`పుష్ప`, `యానిమ‌ల్` చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక బ్రాండ్ మార్కెటింగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా దూసుకుపోతోంది. యువతలో ఆమెకున్న క్రేజ్ కారణంగానే అంతర్జాతీయ బ్రాండ్లు సైతం ఆమెను రాయ బారిగా ఎంచుకుంటున్నాయి. కేవలం సినిమాల్లోనే కాకుండా ఇలాంటి వైవిధ్యమైన‌ వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా నిరంతరం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించి బ్రాండ్ వాల్యూను మరింత పెంచుకుంటోంది.

సాంప్రదాయ కళలను, నేటి తరం ఫ్యాషన్ ట్రెండ్స్‌ను మిళితం చేస్తూ ప్రకటనలు రూపొందించడం వల్ల ఇటు క్లాసిక్ ఆర్ట్‌కు, అటు మోడరన్ బ్రాండ్‌కు సరికొత్త గుర్తింపు లభిస్తుంది. సితార్ లాంటి సాంప్రదాయ వాయిద్యాన్ని నేటి తరం ఇష్టపడే లైఫ్‌స్టైల్ ప్రకటనలో భాగం చేయడం వల్ల యువతలో ఆ కళపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వినూత్న మార్కెటింగ్ వ్యూహాలు కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా కళల కలయికకు కూడా చక్కటి వేదికగా మారుతున్నాయి.

తోటి నటీనటులు ..సహ కళాకారుల నుండి లభించే అభినందనలు ఒక నటీ..న‌టుడు వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో విలువైనవి. రష్మిక మందన్న వెండితెరపైనే కాదు. ఇలాంటి కమర్షియల్ ప్రాజెక్ట్స్‌లో కూడా ప్రతిభను చాటి ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ ప్రకటన ద్వారా లభించిన సానుకూల స్పందన ర‌ష్మిక కెరీర్‌కు - బ్రాండ్ ప్రమోషన్లకు మరింత ఊపునిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.