Begin typing your search above and press return to search.

చెల్లిపై రష్మిక మందన్న ప్రేమ!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా? కుటుంబానికి ఎంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   4 May 2026 8:00 AM IST
చెల్లిపై రష్మిక మందన్న ప్రేమ!
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా? కుటుంబానికి ఎంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. వృత్తిప‌రంగా ఎంత బిజీగా ఉన్నా? ఫ్యామిలీకంటూ కొంత స్పేస్ కేటాయిస్తుంది. పెళ్లికి ముందు త‌ల్లిదండ్రుల‌ల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపిన అమ్మ‌డు వివాహం అనంత‌రం అత్తింటి కుటుంబంతోనే అంతే మ‌మేకంగా ఉంటోంది. అలాగ‌ని పుట్టినింటికి దూరం కాలేదు. త‌ల్లిదండ్ర‌ల‌తోనే అంతే మ‌మ‌కారంగా మెలుగుతుంది. తాజాగా చెల్లెలు సిమ్రాన్ పట్ల తనకున్న అపారమైన ప్రేమను మరోసారి చాటుకుంది. సిమ్రాన్ 13వ పుట్టినరోజును పురస్కరించుకుని రష్మిక సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంది.

షూటింగ్ బిజీలో ఉన్నా? సోదరి ఎదుగుదలను చూసి గర్వపడుతున్నానని సోద‌రి తన జీవితంలో ఎంత ముఖ్యమో రష్మిక ఈ సందర్భంగా మ‌రోసారి గుర్తు చేసుకుంది. చెల్లికి విషెస్ చెప్పిన ర‌ష్మిక ఓ విలువైన సలహాను కూడా అందించింది. `నువ్వు ఇప్పుడు టీనేజ్‌లోకి అడుగుపెట్టావు. ప్రపంచం నీకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. కానీ నీలోని స్వచ్ఛతను, చిరునవ్వును ఎప్పటికీ కోల్పోవద్దు` అంటూ రాసుకొచ్చింది. అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం ఎంత గొప్పదో రష్మిక మాటల్లో కనిపిస్తోంది. సోదరిగానే కాకుండా, మార్గదర్శిగా కూడా రష్మిక తన బాధ్యతను నెర‌వేరుస్తుంది.

ఈ పోస్ట్‌తో పాటు రష్మిక తన సోదరితో ఉన్న కొన్ని అరుదైన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇందులో సిమ్రాన్ చిన్నప్పటి ఫోటోలు , ప్రస్తుతం ఆమె టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత దిగిన ఫోటోలు ఉన్నాయి. రష్మిక బిజీ షెడ్యూల్ కారణంగా చెల్లెలి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు కొంత విచారాన్ని వ్యక్తం చేసింది. కానీ తన మనసు ఎప్పుడూ కుటుంబం దగ్గరే ఉంటుందని, త్వరలోనే ఇంటికి వెళ్లి అందరినీ కలుస్తానని ర‌ష్మిక తెలిపింది. సిమ్రాన్ తన 13వ ఏట అడుగుపెట్టడం అనేది రష్మికకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోంది.

తన కళ్ళ ముందే ఎదుగుతోన్న చిన్నారి సోదరి ఇప్పుడు బాధ్యతాయుతమైన అమ్మాయిగా మారుతుండటం రష్మికను ఆశ్చర్యానికి గురిచేస్తోందట. `నువ్వు ఏం చేసినా నీ వెనుక నేను ఉంటాను. నీ కలలను నిజం చేసుకో` అంటూ రష్మిక ఇచ్చిన భరోసా సోదరి పట్ల ఆమెకు ఉన్న రక్షణ భావాన్ని తెలియజేస్తోంది. సోషల్ మీడియాలో రష్మికకు ఉన్న భారీ ఫాలోయింగ్ తో ఈ పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ అయింది. రష్మిక అభిమానులు కూడా సిమ్రాన్‌కు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రష్మిక కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని ఎప్పుడూ చాలా గౌరవిస్తుంద‌ని, ముఖ్యంగా చెల్లెలికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంద‌ని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.