రష్మిక మందన్న చెల్లెలు నటనారంగంలోకి?
ప్రపంచవ్యాప్తంగా `సిబ్లింగ్స్ డే` (సోదర సోదరీమణుల దినోత్సవం) జరుపుకుంటున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన వ్యక్తిగత జీవితంలోని ఒక మధురమైన జ్ఞాపకాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.
By: Sivaji Kontham | 10 April 2026 11:10 PM ISTప్రపంచవ్యాప్తంగా `సిబ్లింగ్స్ డే` (సోదర సోదరీమణుల దినోత్సవం) జరుపుకుంటున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన వ్యక్తిగత జీవితంలోని ఒక మధురమైన జ్ఞాపకాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన చిన్నారి సోదరి శిమన్ మందన్నతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాలో ఒక అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేశారు. ``బహుశా ఈరోజు సిబ్లింగ్స్ డే అనుకుంటా.. అందుకే ఇదిగో`` అంటూ రష్మిక పెట్టిన సరదా క్యాప్షన్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్లామర్ ప్రపంచంలో ఎంత బిజీగా ఉన్నా.. తన మూలాలను.. కుటుంబ బంధాలను రష్మిక ఎంతగా గౌరవిస్తారో ఈ పోస్ట్ ద్వారా మరోసారి స్పష్టమైంది.
అయితే రష్మిక తో కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించిన శిమన్ అందచందాలు యువతరాన్ని ఆకర్షించాయి. సిమన్ కూడా ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. ఒకవేళ నటనారంగంలోకి అడుగుపెడితే కథానాయికగా ఎదిగేందుకు ఛాన్సుందని ఈ ఫోటోని షేర్ చేసి వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. అయితే శిమన్ వయసు ఇంకా చాలా చిన్నది. తనకు కేవలం 14 వయసు. రష్మిక 16 ఏళ్లు పెద్దది. వయసు రీత్యా ఇద్దరి మధ్యా చాలా వ్యత్సాసం ఉంది. ప్రస్తుతం టీనేజ్ దశలో ఉన్న శిమన్ కేవలం విద్యాభ్యాసంపైనే దృష్టి సారించింది. అయితే తను కూడా నటనారంగంలోకి వచ్చి రష్మిక స్థాయిలో నేము, ఫేము సంపాదించాలనుకుంటే రెడ్ కార్పెట్ వేయడానికి పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయి. అయితే శిమన్ కి నటనపై ఆసక్తి ఉందా లేదా? అన్నది ఇంకా తెలియడం లేదు. తన సోదరి గురించి రష్మిక మాట్లాడేందుకు ఇప్పుడు సిద్ధంగా లేదు. కానీ అలాంటి ఒక రోజు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. శిమన్ ఇటీవల రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకలో కనిపించింది.
26 ఫిబ్రవరి 2026న తన వివాహం తర్వాత తొలి పుట్టినరోజు కావడంతో రష్మిక అభిమానులు, సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రష్మిక భర్త, నటుడు విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఒక ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం `రణబలి`కి సంబంధించిన బిహైండ్ ద సీన్స్ వీడియోను విజయ్ అభిమానులతో షేర్ చేస్తూ రష్మికకు విషెస్ తెలిపారు. విజయ్ షేర్ చేసిన వీడియోలో రష్మిక ఈ చిత్రంలో జయమ్మ అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టమైంది. జయమ్మ పాత్ర కోసం రష్మిక శ్రమ, ఆ క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేస్తున్న తీరు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మరోవైపు రష్మిక బాలీవుడ్ కెరీర్ కూడా అత్యంత ఆశాజనకంగా సాగుతోంది. దినేష్ విజన్ నిర్మాణంలో వస్తున్న `కాక్టెయిల్ 2` చిత్రంలో కృతి సనోన్ తో కలిసి నటిస్తోంది. 2012లో విడుదలై యువతను ఉర్రూతలూగించిన `కాక్టెయిల్` చిత్రానికి ఇది సీక్వెల్ కావడం విశేషం. నేటి కాలపు ముక్కోణ ప్రేమకథ, స్నేహం. కాంప్లికేటెడ్ మానవ సంబంధాల నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గతంలో రష్మిక నటించిన `ది గర్ల్‌ఫ్రెండ్`మంచి గుర్తింపు తీసుకురాగా.. కాక్ టైట్ సీక్వెల్ తన బాలీవుడ్ మార్కెట్‌ను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
వరుస భారీ చిత్రాలతో కెరీర్‌లో దూసుకుపోతున్న రష్మిక, తన వ్యక్తిగత- వృత్తిగత జీవితాలను ఎంతో హుందాగా సమతుల్యం చేసుకుంటున్నారు. ఒకవైపు తెలుగులో ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఎన్ని విజయాలు అందుకున్నా.., తన సోదరి శిమన్‌తో ఉన్న చిన్ననాటి బంధాన్ని, మధుర క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ తనలోని సాధారణ మనిషిని చాటిచెబుతోంది. రష్మిక ప్రయాణం నేటి తరం నటీమణులకు ఒక గొప్ప స్ఫూర్తి.
