Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కి రష్మిక గుడ్ న్యూస్.. షూటింగ్ సెట్లోకి అడుగు?

రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి రణబాలి అనే సినిమా చేస్తోంది.

By:  Madhu Reddy   |   31 Aug 2026 9:40 AM IST
ఫ్యాన్స్ కి రష్మిక గుడ్ న్యూస్.. షూటింగ్ సెట్లోకి అడుగు?
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూనే డెడికేషన్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. పాత్ర ఏదైనా సరే అవలీలగా ప్రాణం పోస్తూ తనదైన శైలిలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. గర్ల్ ఫ్రెండ్ గా , భార్యగా , భూతంగా, యాక్షన్ లేడీగా ఇలా ఒక్కటేమిటి ఎందులో నటించినా ఆ పాత్రకి పూర్తిస్థాయి న్యాయం చేస్తూ సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది.

ముఖ్యంగా గత మూడు ఏళ్లుగా రష్మిక పట్టిందల్లా బంగారంగానే మారుతోంది. ఆమె నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతూ ఆమెను అందలం ఎక్కిస్తున్నాయి . ఇదిలా ఉండగా రష్మిక గత కొంతకాలంగా రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. తన భర్త విజయ్ దేవరకొండ తో రణబాలితో పాటు యాక్షన్ ఓరియంటెడ్ మైసా మూవీలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసింది . మైసా సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలలో ఎలాంటి డూప్ లేకుండా నటించి గాయపడింది. జూలై నెలాఖరులో గాయపడిన ఈమె అప్పటినుంచి విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ ఇంతకాలం గడిపిన ఈమె.. ఇప్పుడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటూ దిగిన ఫోటోలను మొదలుకొని గార్డెన్ లో పక్షులతో ఎంజాయ్ చేసిన తీరు వరకు ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ త్వరలోనే నేను తిరిగి షూటింగ్ సెట్ లో పాల్గొనబోతున్నాను. అయితే ఇంట్లో గడిపిన మూమెంట్స్ అన్నింటినీ కూడా మిస్ అవుతున్నాను అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. మొత్తానికి అయితే రష్మిక మందన్న త్వరలో షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతోందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే.. తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి రణబాలి అనే సినిమా చేస్తోంది.. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కావాల్సి ఉండగా.. దసరా సెలవులకు కోసం ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కూడా మరొకవైపు షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఈమె నటిస్తున్న మరో చిత్రం మైసా. ఇందులో రష్మిక మందన్న లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే ఈమె నటిస్తున్న మరో చిత్రం రాకా. అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న నెగిటివ్ షేడ్ వున్న పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రష్మిక తిరిగి త్వరలో షూటింగ్ సెట్ లో పాల్గొనబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.