Begin typing your search above and press return to search.

నేష‌న‌ల్ క్ర‌ష్ ఈ హీరోల‌కు బాకీ ఉండిపోయిందే!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప`, సూప‌ర్ స్టార్ మహేష్ తో `సరిలేరు నీకెవ్వరు` వంటి స‌క్సెస్ పుల్ చిత్రాల్లో భాగ‌మైంది.

By:  Srikanth Kontham   |   23 March 2026 11:17 AM IST
నేష‌న‌ల్ క్ర‌ష్ ఈ హీరోల‌కు బాకీ ఉండిపోయిందే!
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప`, సూప‌ర్ స్టార్ మహేష్ తో `సరిలేరు నీకెవ్వరు` వంటి స‌క్సెస్ పుల్ చిత్రాల్లో భాగ‌మైంది. ఇంకా విజ‌య్ దేవరకొండ, నితిన్ వంటి యంగ్ స్టార్స్ సరసన నటించి మెప్పించింది. కానీ టాలీవుడ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ముగ్గురు స్టార్లు రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో మాత్రం అమ్మ‌డు ఇంత వరకు వెండితెరను పంచుకోలేదు. ఈ క్రేజీ కాంబినేషన్లు ఎప్పుడు సెట్ అవుతుందా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ -రష్మిక కాంబినేషన్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న `RC17` చిత్రంలో రష్మికను హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. గతంలో `పుష్ప` చిత్రంతో సుకుమార్-రష్మిక కాంబో సృష్టించిన మ్యాజిక్ నేప‌థ్యంలో చరణ్ పక్కన శ్రీవల్లి సెట్ అయితే అది బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ అవుతుందనడంలో సందేహం లేదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికొస్తే? వీరిద్దరి కలయికలో సినిమా రావాలని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా డిమాండ్ ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ న‌టిస్తోన్న చిత్రంలో రుక్మిణీ వ‌సంత్ హీరోయిన్ గా న‌ర‌టిస్తున్నా? ఒక‌ ప్రత్యేక గీతం కోసం లేదా కీలక పాత్ర కోసం రష్మిక తీసుకుంటే బాగుంటుంద‌నే డిమాండ్ తెర‌పైకి వ‌స్తోంది. ఎన్టీఆర్ ఎనర్జీకి, రష్మిక డ్యాన్స్ గ్రేస్‌కు తగ్గట్టుగా ఒక సాంగ్ పడితే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. భవిష్యత్తులో వీరిద్దరి ఫుల్ లెంగ్త్ మూవీ కోసం నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన రష్మిక నటిస్తే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మరో లెవల్‌లో ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న `స్పిరిట్` మూవీలో రష్మిక పేరు మొదట వినిపించినా? ప్రస్తుతం రకరకాల సమీకరణాల వల్ల అది ఇంకా అధికారికం కాలేదు. అయితే ప్రభాస్ లాంటి భారీ కటౌట్ పక్కన రష్మిక వంటి గ్లామరస్ బ్యూటీ జతకడితే అది పాన్-ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ మార్కెట్‌లో కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. రష్మిక బాలీవుడ్ , టాలీవుడ్ లలో బిజీగా ఉన్నప్పటికీ ఈ ముగ్గురు టాప్ స్టార్‌లతో సినిమాలు చేయడం అమ్మ‌డి కెరీర్‌కు ఒక పరిపూర్ణతను ఇస్తుంది.

స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలంటే ఈ ముగ్గురు స్టార్లతో కలిసి పని చేయడం అత్యంత కీలకం. ఈ కాంబినేషన్లు సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుంది. అలా నేషనల్ క్రష్ ఈ ముగ్గురు హీరోలకు బాకీ ఉండిపోయిందనే చెప్పాలి. 2026 -2027 సంవత్సరాల్లో ఈ క్రేజీ ప్రాజెక్టులు పట్టాలెక్కితే? టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర లిఖించబడటం ఖాయం. రష్మిక తనదైన శైలిలో ఈ ముగ్గురు స్టార్ల సరసన మెరిసి, అభిమానుల కోరికను ఎప్పుడు తీరుస్తుందో చూడాలి.