నేషనల్ క్రష్ కోసం రాజ్ అండ్ డీకే!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా గురించి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది.
By: Srikanth Kontham | 25 July 2026 12:28 PM ISTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా గురించి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. వైవిధ్యమైన కథలతో, తనదైన సహజ నటనతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన భామ కోసం ప్రముఖ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే అద్భుతమైన కథను సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓటీటీ ..వెండితెరపై తమకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న దర్శకులు రష్మికతో కలిసి పనిచేయడానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఇటీవలే రాజ్ నడిమోరు కథ అందించిన `మా ఇంటి బంగారం` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో సమంత పేరిట బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు నమోదైంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లోనే ఈ సినిమా వసూళ్ల పరంగా టాప్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే రాజ్ అండ్ డీకే తెలుగు సినిమాలపై మరింత వర్కౌట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ దర్శక ద్వయం తెరకెక్కించే ప్రాజెక్ట్‌లు సాధారణంగా విభిన్నమైన జోనర్‌లో, సరికొత్త కథాంశాలతో సాగుతుంటాయి. అలాంటి యూనివర్సల్ అప్రోచ్ ఉన్న డైరెక్టర్లతో రష్మిక కలవడం కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం కథా చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నా? త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే సినిమాల్లో .. వెబ్ సిరీస్‌లలో నటీనటులకు లభించే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బలమైన పాత్రలతో పాటు, కథలో వచ్చే అనూహ్య మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. తాజాగా నేషనల్ క్రష్ ఇమేజ్‌కు సరిపోయేలా ఆమెలోని నటనను పూర్తిగా వెలికితీసేలా పవర్‌ఫుల్ రోల్‌ను దర్శద్వయం డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కాంబినేషన్ గనుక పట్టాలెక్కితే అది బాక్సాఫీస్ వద్దే కాకుండా డిజిటల్ ప్రపంచంలోనూ సంచలనాలు సృష్టించడం ఖాయం. ఒకవైపు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక ఇలాంటి ప్రయోగాత్మక .. ట్రెండీ ప్రాజెక్ట్‌లను కూడా ఎంచుకోవడం ఆమెకు కంటెంట్ మీద ఉన్న పట్టును తెలియజేస్తోంది. `మా ఇంటి బంగారం` సక్సెస్ జోరుతో రష్మిక మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తుండటం అభిమానులకు పండగలాంటి సమాచారమే.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రచారం ఊపందుకోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజ్ అండ్ డీకే మేకింగ్ స్టైల్, నేషనల్ క్రష్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే? తెరపై విజువల్ వండర్ క్రియేట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. రష్మిక గ్లామర్‌కు మేధావుల ఆలోచనలు తోడైతే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
