Begin typing your search above and press return to search.

రాకాలో రష్మిక.. ఇంత ఛాలెంజింగ్ రోలా?

ముఖ్యంగా ఈ క్యారెక్ట‌ర్ లో రెగ్యుల‌ర్ హీరోయిన్ షేడ్స్ కంటే కథకు ఉపయోగపడే స్ట్రాంగ్ యాంగిల్ ఉంటుందనే టాక్ ఆసక్తిని పెంచుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   23 Sept 2026 4:00 PM IST
రాకాలో రష్మిక.. ఇంత ఛాలెంజింగ్ రోలా?
X

రష్మిక మందన్న కెరీర్‌ను గమనిస్తే.. ఒక్కో సినిమాతో ఆమె తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తోంది. స్టార్ హీరోల సరసన గ్లామర్, లవ్ ట్రాక్‌లకు మాత్రమే పరిమితం కాకుండా యాక్టింగ్ కు ప్రాధాన్యం ఉన్న పాత్రల వైపు కూడా ఆమె అడుగులు వేస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రాకాలో ఆమె భాగం కానుందనే వార్తల నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ మొదలైంది. ఈ సినిమాలో రష్మిక క్యారెక్ట‌ర్ ఇప్పటివరకు ఆమె చేసిన క్యారెక్టర్లకు పూర్తి భిన్నంగా ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ క్యారెక్ట‌ర్ లో రెగ్యుల‌ర్ హీరోయిన్ షేడ్స్ కంటే కథకు ఉపయోగపడే స్ట్రాంగ్ యాంగిల్ ఉంటుందనే టాక్ ఆసక్తిని పెంచుతోంది. కొన్ని సీన్స్ లో నెగటివ్ టచ్ కనిపించినా.. దాన్ని పూర్తిస్థాయి నెగటివ్ క్యారెక్టర్‌గా చూడలేమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఒక క్యారెక్ట‌ర్ ను మంచిదా, చెడ్డదా అనే రెండు కోణాల్లో కాకుండా.. కథలో దాని అవసరం ఏంటి అన్నది కీలకంగా మార్చడంలో అట్లీకి ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే రష్మిక పాత్ర విషయంలో కూడా అసలు ట్విస్ట్ ఏంటి? ఆమె పాత్ర కథను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇక రష్మిక కెరీర్ పరంగా చూస్తే రాకా మరో కొత్త ప్రయోగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆడియ‌న్స్ ఆమెను విభిన్నమైన పాత్రల్లో చూసినప్పటికీ, కథలో కీలకమైన మలుపులకు కారణమయ్యేంత స్ట్రాంగ్ క్యారెక్టర్‌లో చూడటం మాత్రం కొత్త అనుభూతిని ఇవ్వొచ్చనే డిస్క‌ష‌న్ జరుగుతోంది. అదే నిజమైతే నటిగా ఆమె పరిధిని మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాత్రకు సంబంధించిన వివరాలను చిత్రబృందం పూర్తిగా బయటపెట్టకుండా సస్పెన్స్‌ను కొనసాగించడం కూడా సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.