Begin typing your search above and press return to search.

ఆ రెండు పాత్రల ప్రభావం కెరీర్ పై ప్రభావం చూపించాయి

అయితే తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తాను చేసిన పాత్రల్లో తన కెరీర్ పై ప్రభావం చూపిన క్యారెక్టర్ల గురించి మాట్లాడింది.

By:  M Prashanth   |   7 Aug 2025 4:14 PM IST
ఆ రెండు పాత్రల ప్రభావం కెరీర్ పై ప్రభావం చూపించాయి
X

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రష్మిక మంధన్నా టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఆమె నటించిన పుష్ప ఫ్రాంచైజీ సినిమాలు, యానిమల్, ఛావా ఇలా తెలుగు, హిందీ భాషల్లో భారీ విజయం సాధించాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించడమే కాకుండా ఈ సినిమాల్లో ఆమె పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఇలా ఇండస్ట్రీకి వచ్చిన కొన్నేళ్లలోనే పలు పాత్రల్లో నటించి అభిమానులను సొంతం చేసుకుంది.

అయితే తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తాను చేసిన పాత్రల్లో తన కెరీర్ పై ప్రభావం చూపిన క్యారెక్టర్ల గురించి మాట్లాడింది. తన కెరీర్ పై పుష్ప సినిమాలోని శ్రీవల్లి, ఛావా చిత్రంలోని మహారాణి యేసుబాయి పాత్రల ప్రభావం ఉందని చెప్పింది. ఈ రెండు పాత్రలు తన జీవితాన్ని మార్చేసిన క్యారెక్టర్స్ అని చెప్పింది. ఓ నటిగా తనపై వాటి ప్రభావం ఉందని తెలిపింది. అలాగే ఈ పాత్రలకు లభించిన ఆదరణ కారణంగా ఓ నటిగా తనపై తనకు పూర్తి నమ్మకం వచ్చిందని పేర్కొంది.

పుష్ప సినిమాతో పాన్ఇండియా స్టార్ గా మారిన రష్మిక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన రాలేదు. అయితే అదే సమయంలో బాలీవుడ్ లోన పలు సినిమాలు ఆడని టైమ్ లో ... రణబీర్ కపూర్ తో కలిసి చేసిన యానిమల్ మాత్రం హిందీలో మరో లైఫ్ ఇచ్చింది. ఈ సినిమా ఆమెను బాలావుడ్ లోనూ స్పెషల్ గ మార్చింది. అయితే యానిమల్ సినిమాలో తన పాత్రపై వచ్చిన విమర్శలను మాత్రం రష్మిక లైట్ తీసుకోమంటోంది. సినిమాలు చూడాలంటూ ఎవరూ ఎవర్నీ బలవంతపెట్టరని, అందుకే అవి లైట్ అని చెప్పింది. దీంతో ఆమెపై హిపోక్రటిక్ అంటూ ట్రోల్ చేశారు.

కాగా, టాప్ లో ఉన్న రష్మికను రీసెంట్ కుబేర సినిమా మాత్రం కాస్త నిరాశ పర్చిందనె చప్పవచ్చు. వైవిధ్యమైన పాత్ర అని ఆమె దానికి ఒప్పుకున్నప్పటికీ.. ఆ పాత్రను తెరకెక్కించిన విధానం, అందులోని ఓ పాటను సినిమా నుండి తొలగించడంతో రష్మిక డిసప్పాయింట్ అయ్యిందట. అయితే నూరు శాతం పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించే రష్మికకూ ఓటములు తప్పలేదు. కానీ పుష్ప, యానిమల్, ఛావా వంటి సినిమాలు ఆమెను హీరోయిన్ గా మరో స్థాయిలో నిలబెట్టడడం ఓ వరంగా భావించాలి.

ఇక ఇప్పుడు ఆమె మరోసారి గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ది గర్ల్ ఫ్రెండ్ తోపాటు హిందీ చిత్రం థామ కూడా తనను నటిగా మరో స్థాయికి తీసుకెళ్తుందని రష్మిక అనుకుంటోంది. ఈ రెండు పాత్రలు పూర్తిగా డిఫరెంట్. ఒకదాంతో ఇంకోదానికి సంబంధం లేదు. థామ సినిమాను ఆదిత్య సర్పోత్ దార్ తెరకెక్కిస్తున్నారు. ఇది అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందనుంది. గర్ల్ ఫ్రెండ్ రాహుల్ తెరకెక్కిన్నారు.