Begin typing your search above and press return to search.

పాత్రలో జీవించడం కోసం నేర్చుకోవడం తప్పనిసరి!

ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించేందుకు రష్మిక మందన్న కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నట్లు సమాచారం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే సుబ్బలక్ష్మికి సంబంధించిన వందలాది వీడియోలను చూసి ఆమె బాడీ లాంగ్వేజ్‌పై అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది.

By:  Ramesh Palla   |   23 Nov 2026 1:37 PM IST
పాత్రలో జీవించడం కోసం నేర్చుకోవడం తప్పనిసరి!
X

ఒకప్పటితో పోల్చితే ప్రేక్షకులు సినిమా లో నాచురాలిటీ ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నారు. ఒక నటుడు లేదా నటి ఏదైనా పాత్రలో కనిపించినప్పుడు ఆ పాత్రలో నటించినట్లు కాకుండా జీవించినట్లు అనిపిస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పాత్రలో లీనం అయ్యి, ఆ పాత్రకు తగ్గట్లుగా మేకోవర్‌ మాత్రమే కాకుండా బాడీ లాంగ్వేజ్‌, ఇతర అన్ని విషయాలను మార్చుకున్నప్పుడు మాత్రమే ఆ పాత్రకి అతడు సెట్‌ అయినట్లుగా అనిపిస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో హీరోలు దాదాపు అందరూ ఒక పాత్ర చేయడానికి ముందు కనీసం రెండు మూడు నెలలు అంతకు మించి రెడీ అవుతున్నారు. ఆ సమయంలో ఆ పాత్ర బాడీ లాంగ్వేజ్‌ను ప్రాక్టీస్ చేయడం, భాషకు సంబంధించిన యాసను నేర్చుకోవడం, ప్రత్యేకమైన యాక్షన్‌ సీన్స్ ఉంటే అందుకు శిక్షణ తీసుకోవడం, చివరకు హెయిర్‌ స్టైల్‌ సైతం విగ్గుతో మేనేజ్‌ చేయకుండా, జుట్టు పెంచుకోవడం వంటివి చేస్తున్నారు.

రష్మిక మందన్న కోసం మార్షల్ ఆర్ట్స్ క్లాస్‌...

హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ సైతం ఈ మధ్య కాలంలో అలాగే చేస్తున్నారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్న దాదాపు అందరు హీరోయిన్స్‌ ఆయా పాత్రలకు తగ్గట్లుగా తమను తాము మల్చుకున్న తర్వాత మాత్రమే సినిమా షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. హీరోయిన్స్‌ సాధారణంగా సుకుమారంగా ఉంటారు. కానీ అలాంటి వారికి యాక్షన్‌ సీన్స్‌ ఉన్న సినిమాలు పడితే కచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే యాక్షన్‌ సీన్స్ ఉన్న సినిమాలు ఏమైనా చేయాల్సి వస్తే ముందస్తుగా వర్కౌట్స్ చేయడం, మార్షల్‌ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల మైసా సినిమా కోసం రష్మిక మందన్న మార్షల్‌ ఆర్ట్స్‌ తో పాటు, పలు యుద్ద విద్యలకు సంబంధించిన ట్రైనింగ్ తీసుకుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో సంగీతం పై పట్టు కోసం రష్మిక మందన్న రెడీ అవుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ఎంఎస్‌ మూవీ గురించి...

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో 'ఎం.ఎస్‌ : ఎ లెగసీ ఆన్‌ స్క్రీన్‌' అనే సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను లెజెండ్రీ సింగర్‌, భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు ఇటీవలే లాంచనంగా ప్రారంభం అయ్యాయి. రెగ్యులర్‌ షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో సుబ్బలక్ష్మి పాత్రలో నటించింది అనిపించుకోకుండా రష్మిక మందన్న జీవించింది అనిపించుకునేందుకు సాధ్యం అయినంత వరకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుబ్బలక్ష్మి బయోపిక్‌ అంటే కచ్చితంగా పాటలు ప్రధానంగా ఉంటాయి. కనుక రష్మిక మందన్నకు మినిమం సంగీతం పై అవగాహన ఉండాలి. అందుకే ఇప్పుడు కర్ణాటక సంగీతం ను నేర్చుకుంటుందని తెలుస్తోంది.

ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌..

ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌ కోసం రష్మిక మందన్న చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు ఇంతకు ముందే ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఆమె బాడీ లాంగ్వేజ్‌ను మ్యాచ్‌ చేయడం కోసం ఆమెకు సంబంధించిన ఎన్నో వందల వీడియోలను రష్మిక మందన్న చూసిందట. ఇప్పుడు సంగీతం పై అవగాహన కోసం ఏకంగా సంగీతం ని నేర్చుకునేందుకు రెడీ అయింది. ఒక సినిమా కోసం ఏకంగా సంగీతం నేర్చుకునేందుకు హీరోయిన్‌ రెడీ కావడం అరుదుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు హీరోలు హీరోయిన్స్‌ పాత్రల్లో జీవించడం కోసం ప్రతిదాన్ని నేర్చుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. అయితే ఈ నేర్చుకోవడం కోసం ఎక్కువ సమయం పట్టడం, దాంతో సినిమాలు ఆలస్యం కావడం జరుగుతుంది. ఆలస్యం అయినా పర్వాలేదు కానీ పోషించిన పాత్రకు జీవం పోయాలి అనుకోవడం అనేది మంచి ఉద్దేశం. అందుకే స్టార్స్‌ సినిమాల సంఖ్య చాలా తగ్గింది. ఇంతకు ముందుతో పోల్చితే ప్రతి పాత్ర కోసం ముందస్తు వర్కౌట్స్‌ చాలా జరుగుతున్నాయి.