ఎంగేజ్‌మెంట్ రింగ్‌పై రష్మిక ఏమన్నారంటే?
నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. నవంబర్ 7న గర్ల్‌ఫ్రెండ్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 3 Nov 2025 6:14 PM ISTనేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. నవంబర్ 7న గర్ల్‌ఫ్రెండ్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే సీనియర్ హీరో జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో కు కూడా గెస్టు గా హాజరైంది రష్మిక.
రష్మిక ను గాలి పిల్ల అనేసిన జగపతి
తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో రిలీజవగా అందులో రష్మిక తన కెరీర్ తో పాటూ పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఓ రకంగా నీకు ఓ నిక్ నేమ్ పెట్టాను. గాలి పిల్ల అని జగపతి అనగానే దానికి రష్మిక అయ్యయ్యో అంటూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. విజయ్ దేవరకొండతో ఫ్రెండ్‌షిప్, విజయ్ సేతుపతికి ఫ్యాన్, దళపతి విజయ్ కు ఆల్ టైమ్ ఫ్యాన్.. అంటే విజయం, విజయ్ ను మొత్తానికి సొంతం చేసేసుకున్నావా అని అడగ్గా, దానికి రష్మిక చాలా క్యూట్ గా నవ్వేశారు.
వాటిని ఎంజాయ్ చేస్తున్నానంటున్న రష్మిక
ఇక రష్మిక చేతికి పెట్టుకున్న రింగ్స్ గురించి మాట్లాడుతూ, ఆ రింగ్స్ ఏమైనా సెంటిమెంటా అని అడగ్గా, అంటే చాలా ఇంపార్టెంట్ రింగ్స్ అని రష్మిక చెప్పగా, వాటిలో ఓ రింగ్ ఫేవరెట్ అయ్యుంటుంది, దాని వెనుక ఓ హిస్టరీ కూడా ఉందని అనగా రష్మిక తెగ సిగ్గు పడ్డారు. వెంటనే ఆడియన్స్ నుంచి కేకలు వినిపించగా, వాళ్లేదో గోల చేస్తున్నారు, వాళ్ల బాధేంటో కనుక్కో అనగానే ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్ అని చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా, దసరా రోజున విజయ్ దేవరకొండతో రష్మిక ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
ఆ విషయం తెలుసుకోవాలనుంది
ది గర్ల్‌ఫ్రెండ్ ప్రమోషన్స్ లో భాగంగానే రష్మిక ఎక్స్‌లో ఫ్యాన్స్ లో ముచ్చటించి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రస్తుతం తాను పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నానని, డైరెక్ట్ తమిళ్ మూవీ చేయడానికి కాస్త టైమ్ పడుతుందని, చాలా సినిమాలు ప్రస్తుతం డిస్కషన్స్ స్టేజ్ లోనే ఉన్నాయన్నారు రష్మిక. తనకు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని, వారి గురించి పబ్లిక్ లో చెప్తే తనను చంపేస్తారని రష్మిక చెప్పారు. ది గర్ల్‌ఫ్రెండ్, థామా సినిమాల్లో ఏ సినిమా చేయడం కష్టంగా అనిపించిందంటే గర్ల్‌ఫ్రెండ్ సినిమా పేరే చెప్పారు రష్మిక. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, ఆయనకు ఎప్పటికీ వయసు అయిపోవడం లేదని, రోజురోజుకీ వయసు తగ్గుతుందని, అదెలా సాధ్యమో తెలుసుకోవాలనుకుంటున్నట్టు రష్మిక చెప్పుకొచ్చారు.
