Begin typing your search above and press return to search.

రష్మిక మేడం కొత్త సినిమాలు ఏవి..?

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న గత ఏడాది అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏడాది ఆరంభంలో ఛావా సినిమా విడుదల అయింది.

By:  Ramesh Palla   |   11 July 2026 10:00 PM IST
రష్మిక మేడం కొత్త సినిమాలు ఏవి..?
X

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న గత ఏడాది అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏడాది ఆరంభంలో ఛావా సినిమా విడుదల అయింది. ఆ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లు సాధించడం మాత్రమే కాకుండా రష్మిక మందన్నకు మంచి పేరును తెచ్చి పెట్టింది. ఛావా వంటి సినిమాలో నటించినందుకు గర్వంగా ఉందని రష్మిక పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అలాంటి పాత్రలు మరిన్ని చేయాలని ఆమె అభిమానులు సైతం కోరుకున్నారు. ఛావా విడుదలైన కొన్ని రోజులకు హిందీ మూవీ సికిందర్‌ వచ్చింది. సల్మాన్‌ ఖాన్‌ నటించిన సికిందర్‌ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయితే రష్మిక మందన్నకు ఆ సినిమా మంచి పేరే తెచ్చింది. రష్మిక హిందీలో కొత్తగా కనిపించేందుకు ఆ సినిమా ఉపయోగపడిందని చాలా మంది అన్నారు.

ధనుష్‌, నాగార్జున కుబేరా సినిమా...

గత ఏడాదిలోనే కుబేరా సినిమాతో రష్మిక వచ్చింది. ధనుష్‌, నాగార్జునలు హీరోలుగా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాలో రష్మిక పోషించిన పాత్రకు సైతం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత థామాతో ప్రేక్షకులను భయపెట్టింది. రష్మిక ఇలాంటి పాత్రలు సైతం చేస్తుందా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందాల రాక్షసి అంటూ రష్మిక మందన్న పై అభిమానులు ఆ సినిమా సమయంలో ప్రశంసలు కురిపించారు. ఆకట్టుకునే రూపంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడంతో థామా సినిమాలోని ఆ పాత్రకు బాగా సెట్‌ అయింది. ఇక ఏడాది చివర్లో ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమాతో వచ్చింది. ఆ సినిమాలో రష్మిక మందన్న నటనకు అవార్డ్‌ ఖాయం అని అభిమానులు మాట్లాడుకున్నారు. సినిమా కమర్షియల్‌గా కూడా వర్త్‌ అనిపించింది అంటూ టాక్‌ వచ్చింది.

విజయ్‌ దేవరకొండ రణబాలి సినిమా...

ఇక ఈ ఏడాది విషయానికి వస్తే రష్మిక మందన్న చాలా సైలెంట్‌గా ఉంటుంది అనిపిస్తోంది. గత ఏడాదిలో ప్రారంభం అయిన కాక్‌ టైల్‌ 2 సినిమా ఈ ఏడాది ఆరంభంలో విడుదల అయింది. ఇక మైసా, రణబాలి సినిమాల్లో రష్మిక నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లో మైసా సినిమా లేడీ ఓరియంటెడ్‌ మూవీగా తెలుస్తోంది. ఇటీవల ఆ సినిమా నుంచి వచ్చిన పోస్టర్‌ తో అంతా సర్‌ప్రైజ్‌ అయ్యారు. మరోసారి రష్మిక మందన్న ను కొత్తగా చూడబోతున్నాం అనిపించింది అంటున్నారు. ఇక భర్త విజయ్‌ దేవరకొండతో కలిసి రణబాలి సినిమాలో కనిపించబోతుంది. ఈ రెండు సినిమాలు మినహా రష్మిక మందన్న కొత్త సినిమాలు ఏమీ చేయడం లేదు. ఈ రెండు సినిమాలు సైతం పెళ్లికి ముందు ఒప్పుకున్న సినిమాలు కావడం విశేషం. పెళ్లి తర్వాత రష్మిక కొత్త సినిమాలు ఏమీ ప్రారంభం కాకపోవడం పై చర్చ జరుగుతోంది.

రష్మిక మందన్న కొత్త సినిమాలు...

రష్మిక మందన్న స్టార్‌డం ఉన్న హీరోయిన్‌. ఆమె ఓకే చెప్పాలి కాని ఏడాదికి అర డజను సినిమాలు చేయగలదు. కమర్షియల్‌ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు సైతం ఆమె ముందు క్యూ కట్టే అవకాశం ఉంది. అలాంటి రష్మిక మందన్న ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడం లేదు. అసలు పెళ్లి అయిన తర్వాత కొత్త సినిమాలకు ఎందుకు ఓకే చెప్పలేదు అనే చర్చ జరుగుతోంది. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయని, అంతకు ముందు మాదిరిగా సినిమాలు చేయడం కుదరదు కనుక రష్మిక కాస్త స్లో అయ్యి ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే చిన్న బ్రేక్ మాత్రమే అని వచ్చే ఏడాదిలో రష్మిక నటించిన సినిమాలు మూడు నాలుగు అయినా విడుదల అవుతాయని ఆమె అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఈ గ్యాప్‌ గురించి మాత్రం రష్మిక మందన్న నోరు మెదపడటం లేదు. మరో వైపు రష్మిక భర్త విజయ్‌ దేవరకొండ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తున్నాడు.