Begin typing your search above and press return to search.

నేష‌న‌ల్ క్ర‌ష్ జోరు త‌గ్గించిందా?

ఇవి రెండు రెండేళ్ల క్రిత‌మే క‌మిట్ అయిన చిత్రాలు. మ‌రి చేతిలో కొత్త క‌మిట్ మెంట్లు ఏవైనా ఉన్నాయా? అంటే ఒక్క‌టి కూడా లేదు.

By:  Srikanth Kontham   |   21 Aug 2025 9:00 AM IST
నేష‌న‌ల్ క్ర‌ష్ జోరు త‌గ్గించిందా?
X

నేష‌న‌ల్ క్ర‌ష్ కొత్త సినిమా క‌మిట్ మెంట్ల జోరు తగ్గించిందా? అతివేగం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వేగాన్ని త‌గ్గిం చిందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. గత ఏడాది `పుష్ప 2` రిలీజ్ అనంత‌రం అమ్మ‌డు వ‌రుస‌గా రెండు సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. బాలీవుడ్ లో `ఛావా`తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోగా, `సికింద‌ర్` ప్లాప్ లో ఆ హిట్ ని బ్యాలెన్స్ చేసేసింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన `కుబేర` తో మ‌రో గ్రాండ్ విక్ట‌రీని అందుకుంది. మొత్తంగా రెండేళ్ల ర‌ష్మిక గ్రాఫ్ ప‌రిశీలిస్తే ఎంతో మెరుగ్గా ఉంది.

సౌండింగ్ గ‌ట్టిగానే:

వ‌రుస విజ‌యాలు అమ్మ‌డిని అగ్ర ప‌థాన కూర్చోబెట్టాయి. ప్ర‌స్తుతం తెలుగులో `ది గ‌ర్ల్ ప్రెండ్` అనే లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో న‌టిస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకు మంచి బజ్ ని తీసుకొచ్చాయి. ర‌ష్మిక కు స‌రైన టైమ్ లో ప‌డిన ఉమెన్ సెంట్రిక్ చిత్రంగా మార్కెట్ లో సౌండింగ్ గ‌ట్టిగానే వినిపిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్లో `థామా`లో న‌టిస్తోంది. ఇందులోనూ అమ్మ‌డు శ‌క్తివంత‌మైన పాత్ర‌లో అల‌రించ‌నుంది. అయితే ఈ రెండు చిత్రాలు ర‌ష్మిక క‌మిట్ అయి చాలా కాల‌మ‌వుతోంది.

ఛాన్సులొచ్చినా నో అంటోందా:

ఇవి రెండు రెండేళ్ల క్రిత‌మే క‌మిట్ అయిన చిత్రాలు. మ‌రి చేతిలో కొత్త క‌మిట్ మెంట్లు ఏవైనా ఉన్నాయా? అంటే ఒక్క‌టి కూడా లేదు. అవ‌కాశాలు రాక క‌మిట్ అవ్వ‌లేదా? అంటే ర‌ష్మిక‌కు అవ‌కాశాలు రాక‌పోవ‌డం ఏంటి? అమ్మ‌డు ఊ అనాలి గానీ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు క్యూలో నిల‌బ‌డ‌తారు. మ‌రే కారణంగా క‌మిట్ అవ్వ లేదంటే? అతివేగం ప్ర‌మాదక‌రం అనే కార‌ణం తెర‌పైకి వ‌స్తోంది. అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని క‌మిట్ అయి చేస్తే? అవి స‌రైన పాత్ర‌లు కాక‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని ర‌ష్మిక కొత్త సినిమాలేవి క‌మిట్ అవ్వ‌డం లేద‌న్న విష‌యం తెలిసింది.

వ‌చ్చే ఏడాది వ‌ర‌కూ ఆగాల్సిందే:

కెరీర్ పీక్స్ లో ఉంద‌ని ఏదో ఒక‌టి చేసేయ‌డం కంటే? నిక్క‌మైన నీలంమొక్క‌టి చాలు అన్న త‌రహాలో క‌థాబ‌లం సినిమా ఒక్క‌టి చేసినా చాల‌ని భావిస్తోందిట‌. ఇటీవ‌ల వ‌చ్చిన కొన్ని తెలుగు, హిందీ అవ‌కా శాల‌ను ఆ కార‌ణంఆనే రిజెక్ట్ చేసిందిట‌. ప్ర‌స్తుతానికి ఏ సినిమాల‌కు క‌మిట్ అవ్వ‌కూడ‌ద‌ని కొత్త సినిమాలు ఏవైనా వ‌చ్చే ఏడాదే సైన్ చేసేలా? ఓ ప్ర‌ణాళిక సిద్దం చేసుకుంద‌ని స‌మాచారం. ఆ ప్ర‌కార‌మే ముందు కెళ్తుందిట‌. మొత్తానికి ర‌ష్మిక పాన్ ఇండియా ఇమేజ్ ఎక్క‌డా దెబ్బ తిన‌కుండానే ఓ ప్లానింగ్ ప్ర‌కార‌మే ముందుకెళ్తుంద‌ని తేట‌తెల్ల‌మ‌వుతోంది.