బన్నీ Vs రష్మిక.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా!
అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By: M Prashanth | 5 Feb 2026 5:27 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ జానర్ లో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా.. ఇప్పటికే ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఇప్పటికే చాలా మంది ఫిక్స్ అయిపోయారని చెప్పాలి.
అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అదే సమయంలో సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
వాటిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న నటిస్తున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మృణాల్, జాన్వీ సంగతి పక్కన పెడితే.. రష్మిక నటించడం మాత్రం నిజమేనని తెలుస్తోంది. అల్లు అర్జున్- రష్మిక జోడీకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, అట్లీ ఆ కాంబో మరోసారి తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేశారని సమాచారం.
ఇప్పటికే బన్నీ, రష్మిక కలిసి చేసిన పుష్ప సిరీస్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అంతే కాదు.. వారి కాంబోకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పుడు అట్లీ- అల్లు అర్జున్ మూవీ షూటింగ్ లో రష్మిక పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ముంబైలో జరుగుతున్న షెడ్యూల్ లో అమ్మడు పాల్గొంటోందని.. అర్జున్, కుబేర ఫేమ్ జిమ్ సర్భ్‌లతో కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తోందని వినికిడి.
దాదాపు నెల రోజుల పాటు కొనసాగే ఆ షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ ను మేకర్స్ షూట్ చేయనున్నారని సమాచారం. అయితే సినిమాలో రష్మిక రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ గా కాకుండా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. కెరీర్ లో ఇప్పటి వరకు చేయని సరికొత్త పాత్రలో, ఛాలెంజింగ్ రోల్ లో రష్మిక కనిపించనున్నారని తెలుస్తోంది.
నిజానికి.. ఇప్పటి వరకు ఎక్కువగా పాజిటివ్, సాఫ్ట్ క్యారెక్టర్లు చేసి గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు ఇది పూర్తిగా కొత్త ప్రయోగమనే చెప్పాలి. అయితే అట్లీ ప్లాన్ కోసం ఇప్పుడు నెటిజన్లు, సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు హీరో హీరోయిన్లుగా కనిపించిన వారిని.. బన్నీ వర్సెస్ రష్మిక అనేలా చూపించడం మామూలు విషయం కాదని చెబుతున్నారు. అయితే వస్తున్న వార్తల్లో నిజమెంతో.. సినిమాలో అల్లు అర్జున్, రష్మిక తమ యాక్టింగ్ తో ఎంతలా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.
