Begin typing your search above and press return to search.

రష్మిక మందన్న - కెరీర్ బ్యాలెన్సింగ్ సవాలు!

అలాగే రష్మిక కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలవబోతున్న ప్రాజెక్ట్ భారత రత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్.

By:  Srikanth Kontham   |   29 Sept 2026 8:00 PM IST
రష్మిక మందన్న - కెరీర్ బ్యాలెన్సింగ్ సవాలు!
X

నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న కెరీర్ ప్లానింగ్‌లో పరిణతి చెందిన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. గ్లామర్ తారగా, స్టార్ హీరోల స‌ర‌స‌న కమర్షియల్ సినిమాల్లో మెరిసిన అమ్మ‌డు ఇప్పుడు నటిగా తనలో వైవిధ్యాన్ని ఆవిష్కరించే క్రమంలో పక్కా బ్యాలెన్స్ సూత్రాన్ని పాటిస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలు..లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే పరిమితం కాకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సాగుతోన్న కెరీర్ గ్రాఫ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

గ‌తంలో చాలా మంది అగ్ర కథానాయికలు కెరీర్ ఒక స్థాయికి చేరిన తర్వాత పూర్తిగా ఉమెన్ సెంట్రిక్, సోలో లీడ్ సినిమాల వైపే ఎక్కువ మొగ్గు చూపారు. కానీ రష్మిక మాత్రం లేడీ సూపర్‌స్టార్ నయనతార పాటించిన విజయ వంతమైన మోడల్‌ను ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు అగ్ర హీరోల సరసన భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్లు చేస్తూనే.. మరోవైపు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కథ‌ల్లోనూ న‌టించి ఒకేసారి హైలైట్ అవుతున్నారు.

ఈ వ్యూహంలో భాగంగానే రష్మిక క‌మిట్ అయిన పవర్ ఫుల్ ప్రాజెక్ట్ `మైసా`. ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో రష్మిక ఎన్నడూ చూడని రీతిలో పవర్ ఫుల్ వారియర్ లుక్‌లో అలరించనున్నారు. ఈ సినిమా కోసం అమ్మ‌డు ప్రత్యేకంగా యాక్షన్ స్టంట్లు, బాడీ లాంగ్వేజ్‌లో కఠిన శిక్షణ తీసుకుంది. ఇప్పటికే విడుదలైన లుక్స్‌కి మంచి స్పందన రావ‌డంతో నటనా పరిణితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

అలాగే రష్మిక కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలవబోతున్న ప్రాజెక్ట్ భారత రత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రష్మిక లెజెండరీ గాయని సుబ్బులక్ష్మి పాత్రను పోషిస్తున్నారు. ఇది ర‌ష్మిక జీవితంలో అతి పెద్ద స‌వాల్. ఇలాంటి విలక్షణ పాత్రలు పోషిస్తూనే? అగ్ర హీరోల కాంబినేషన్స్ లోనూ అల‌రిస్తుంది. బిగ్-టికెట్ కమర్షియల్ సినిమాలను కూడా రష్మిక వదులుకోవడం లేదు. దీంతో ర‌ష్మిక కమర్షియల్ మార్కెట్ వాల్యూ మాస్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ చెక్కుచెదరకుండా ఉంది. కమర్షియల్ సక్సెస్‌ను, క్రిటికల్ అక్లైమ్‌ను ఒకే తాటిపైకి తీసుకురావడమే ర‌ష్మిక ప్లాన్‌లోని హైలైట్ అయ్యే అంశం.

సమకాలీన కథానాయికలకు ఆదర్శంగా నిలిచేలా రష్మిక బ్యలెన్సింగ్ విధానం సుదీర్ఘ సినీ ప్రయాణానికి బలమైన పునాదిగా మారుతుందనడంలో సందేహం లేదు. నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూనే బిగ్ స్క్రీన్ కమర్షియల్ సినిమాలతో మెరిసే ద్విముఖ వ్యూహం రష్మికను పాన్-ఇండియా స్టార్‌గానే కాకుండా, ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం నిలబడే పవర్‌హౌస్ పెర్ఫార్మర్‌గా నిలబెడుతుందని చెప్పొచ్చు.